కర్నూల్

రామ్‌కో సిమెంటుతో కొలిమిగుండ్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 8: రామ్‌కో సిమెంటు పరిశ్రమ నిర్మాణంతో కొలిమిగుండ్ల ప్రాంతం ఎనలేని అభివృద్ధి అవుతుందని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మండలంలోని కల్వటాల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రామ్‌కోసిమెంటు పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి, పర్యావరణ అధికారి ప్రసాద్, గోపాలకృష్ణ, సంస్థ పర్యావరణ ఏజీఎం మరికృష్ణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.1500 కోట్లతో కల్వటాల భూములు రామ్‌కోసిమెంటు పరిశ్రమ నిర్మాణానికి 2018, డిసెంబర్ 14న సీఎం చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారని, అందుకు సంస్థకు 500 ఎకరాలు పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో భాగంగా కొలిమిగుండ్ల మైన్స్ 255 హెక్టార్లు, చింతలాయపల్లె మైన్స్ 490 హెక్టార్లకు సంబంధించి శుక్రవారం పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి రామ్‌కో సిమెంటు సంస్థ ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. రైతులు, ప్రజలు సహకరించాలని పరిశ్రమ ఏర్పాటుకు అందరు ముందుకు రావాలని సూచించారు. తిమ్మారెడ్డి, బైపురెడ్డి, లాయర్ మహేశ్వరరెడ్డి, రామ పురుషోత్తంరెడ్డి, దశరథరామిరెడ్డి, దామోదర్, ప్రతాపరెడ్డితోపాటు 16 మంది స్థానికులు, రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, జీవ కాలుష్యం, ప్లాస్టింగ్, శబ్ద కాలుష్యం తదితర వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండ పరిశ్రమ స్థాపించుకోవాలని తమ అభిప్రాయం తెలిపారు. ముఖ్యంగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. రామ్‌కో సిమెంటు పర్యావరణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అనంతరం రామ్‌కోసిమెంటు అడ్వైజర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎవరికి ఇబ్బంది లేని విధంగా సిమెంటు పరిశ్రమను నెలకొల్పుతామని, ప్లాంటు నిర్మాణం వల్ల 300 మందికి ప్రత్యక్షంగా, 1200 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వేలాది మందికి అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. తమ సంస్థ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కొలిమిగుండ్ల కొండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.7.5 కోట్లు కేటాయించిందని, దేవస్థానంను అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తామని, డీఎస్‌ఆర్ ఫౌండేషన్ కింద రూ.17.5 కోట్లు కేటాయించామని, 3 సంవత్సరాల్లో సిమెంటు పరిశ్రమ దత్తత గ్రామాల్లో విద్య, వైద్యం, వీదిలైట్లు, తాగునీరు, రోడ్లు, ప్రజా వౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని కాలుష్యం విషయంలో గ్రీన్ ఫీల్డ్ సిమెంటు పరిశ్రమ నిర్మాణం చేపడుతున్నామని, ఎటువంటి కాలుష్యం అనేది ఉండదని ఆయన తెలిపారు.
పాణ్యం టికెట్ మాకే..
* ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి
గడివేముల, ఫిబ్రవరి 8: టీడీపీ వారు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చి పార్టీలు మారమని ఎన్నో ప్రలోభాలు పెట్టిన తలొగ్గకుండా జగనన్నను నమ్ముకొని వైకాపాను అంటిపెట్టుకొని తిరుగుతున్న మాకే పాణ్యం వైకాపా టికెట్ వస్తుందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పశువుల కొట్టం కాలి గాయపడిన పశువుల యజమాని విశ్వంకు రూ.10 వేల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువుల కొట్టం కాలి గాయపడిన పశువుల యజమానికి ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అలాగే విలేఖర్ల సమావేశంలో పాణ్యం టికెట్ గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించగా పాణ్యం వైకాపా టికెట్ ఖచ్చితంగా తమకే వస్తుందన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు అభివృద్ధి పనులకు నిధులను తమ పార్టీ వారికే కేటాయించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి వైపు చేయకుండా ఆటంకపడ్డారని తెలిపారు. మండలంలో వెలగమాను డ్యాం నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేశానని, అయితే ప్రభుత్వం సాధించలేకపోయిందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి డ్యాం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
బీపీఎస్‌పై ప్రజలకు
అవగాహన కల్పించాలి
* టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉప సంచాలకులు రామకృష్ణారెడ్డి
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 8:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉప సంచాలకులు(అమరావతి) రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాలులో నగర పాలక, పురపాలికల్లోని పట్టణ ప్రణాళిక అధికారులు, లైసెన్స్‌డ్ ఇంజినీర్లకు బీపీఎస్ పథకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ సంచాలకులు (అనంతపురం) శైలజ, కుడా డిప్యూటీ డైరెక్టర్ హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్ పథకం గురించి రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక పట్టణ ప్రణాళిక అధికారులు, లైసెన్స్‌డ్ ఇంజినీర్లు అవగాహన కలిగి భవనాల క్రమబద్ధీరణకు సంబంధించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. బీపీఎస్ ద్వారా అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్థులు, సెట్‌బాక్స్‌లు, లే ఔట్లు, ప్రభుత్వ స్థలాలపై ఒక అంచనాకు రావచ్చన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారమై పురపాలక సంఘాలకు ఆదాయం వస్తుందన్నారు.
శ్రీ సుజరుూంద్రతీర్థుల పూర్వారాధన వేడుకలు ఘనంగా ప్రారంభం
మంత్రాలయం, ఫిబ్రవరి 8: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో మంత్రాలయం నవనిర్మాణ శిల్పి, పూర్వాపు పీఠాధిపతులు శ్రీసుజరుూంద్ర తీర్థుల పూర్వారాధన వేడులకు ఘనంగా జరిగాయి. శుక్రవారం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు పూర్వారాధన వేడుకలు పురస్కరించుకుని ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మూడురోజులు పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీసుజరుూంద్ర తీర్థుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, తులసి అర్చన, ఉత్సవ రాయల పాదపూజ తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం స్వామి బృందావనానికి వెండి కవచాలు, వివిధ ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అంతక ముందు శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఉత్సవాలు సందర్భంగా మఠం ప్రాకారంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రముఖ విధ్వాంసులు ప్రవచనలు నిర్వహించారు. రాత్రి శ్రీప్రహ్లాదరాయలను పల్లకి, కొయ్య, వెండి, స్వర్ణ, నవరత్న రథోత్సవాలపై అధిష్ఠించి మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. స్వామి దర్శనార్థం వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
నేడు మధ్యారాధన వేడుకలు..
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం శ్రీసుజరుూంద్ర తీర్థుల మధ్యారాధన వేడుకలు వైభవంగా జరుగునున్నాయి. పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో స్వామి వారి బృందదానానికి విశేష పంచామృతాభిషేకం, పట్టువస్త్రాలు సమర్పణ,ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే మధ్యామరాధన సందర్భంగా శ్రీసుజరుూంద్ర తీర్థుల చిత్రపటాన్ని స్వర్ణపల్లకిలో ఊరేగిస్తారు. సాయంత్రం ప్రముఖ విద్వానుల ప్రవచనలు, భరత నాట్యం, ప్రముఖులకు సన్మాన, గ్రంధ ఆవిష్కరణలు వంటి కార్యక్రమాలు జరుగునున్నాయి.
రోడ్డుపై బైఠాయించిన గిరిజనులు
* 3 గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్
* బారులు తీరిన వాహనాలు
* అటవీ సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం
ఆత్మకూరు, ఫిబ్రవరి 8:కర్నూలు-గుంటూరు కేజీ రోడ్డుపై ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెం వద్ద శుక్రవారం చెంచులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో 3 గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగగా రోడ్డుకిరువైపులా సుమారు 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. బైర్లూటి గూడెంకు చెందిన చెంచులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద సిద్ధాపురం చెరువులో మట్టి పనులు చేస్తున్నారు. తీసిన ఆ మట్టిని చెంచులు ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు తరలించుకుంటున్నారు. ఈక్రమంలో ట్రాక్టర్లు సిద్ధాపురం చెరువు నుంచి తమ పొలాలకు వెళ్లేందుకు అటవీ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు ట్రాక్టర్లను అడ్డుకోవడంతో చెంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం నుంచే తాము ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నామని ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు ప్రయాణికులు విసుగు చెంది అటవీ శాఖ అధికారుల వద్దకు వెళ్లి వారి సమస్యను పరిష్కరించాలని వాగ్వాదానికి దిగడంతో సిబ్బంది తప్పించుకుని వెళ్లిపోయారు. దాదాపు 3 గంటల పాటు చెంచులు రోడ్డుపై ధర్నా చేసి వాహనాలను నిలిపివేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో మా పొలాలకు దారి చూపాలని చెంచులు అడగ్గా పోలీసులు చెంచులు, అటవీ శాఖ అధికారులతో పోలీస్‌స్టేషన్‌లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించుకుందాం అని చెంచులతో చెప్పారు. అయితే మేమందరం అక్కడికి రావడం కంటే డీఎఫ్‌ఓ, సీఐలు ఇక్కడికే వచ్చి సమస్యను పరిష్కరించాలని మొండికేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మాకు న్యాయం జరగదని వారు వాపోయారు. ఎస్‌ఐ మాట్లాడుతూ శనివారం అంతా సమయమిస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతానని తెలిపారు. కాగా చెరువులోని మట్టిని మా పొలాలకు తీసుకెళ్తామని, ఎవరు అడ్డు వచ్చినా ఎదుర్కొంటామని చెంచులు హెచ్చరించారు.
నగర పంచాయతీ
కార్యాలయానికి తాళం
* కలెక్టర్ జోక్యంతో శాంతించిన పొదుపు మహిళలు
ఆత్మకూరు, ఫిబ్రవరి 8:పొదుపు మహిళలకు చెక్కుల పంపిణీలో వివక్ష చూపుతున్నారని మండిపడుతూ శుక్రవారం పొదుపు సంఘాల మహిళలు నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి తాళం వేశారు. పసుపు-కుంకుమ పథకం కింద పొదుపు సంఘాల్లోని ప్రతి సభ్యురాలికు రూ. 10 వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి స్థానిక ఎమ్మెల్యేల చేత చెక్కులు పంపిణీ చేయించారు. అయితే స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు వివక్ష చూపుతూ టీడీపీలో చేరితేనే చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడంతో సమస్య జఠిలమైంది. చెక్కుల పంపిణీ విషయంలో రాజకీయ నాయకుల జోక్యంతో సమస్య ముదిరింది. గత రెండు రోజుల నుంచి పొదుపు మహిళా సంఘాల నాయకురాళ్లు, సభ్యులు ధర్నా చేసినా లాభం లేకపోవడంతో పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. చెక్కుల కోసం మహిళలు చివరకు స్టేషన్‌లో కూడా ధర్నా చేశారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ వెంకట్రావు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ విషయంపై ఆరా తీసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ సత్యనారాయణ సోమవారం పొదుపు సంఘం నాయకురాళ్లతో చెక్కుల పంపిణీ చేపట్టాలని ఆదేశించడంతో పొదుపు మహిళలు శాంతించారు. ఈ సందర్భంగా దరగమ్మ మాట్లాడుతూ కలెక్టర్ చెప్పడంతో ఆందోళన విరమిస్తున్నామని సోమవారం వరకూ ఎదురుచూస్తామన్నారు. ఇకపై వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరికీ చెక్కులు అందజేయాలని ఆమె కోరారు.
అహోబిలేశునికి అడుగడుగునా స్వాగతం
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 8: పారువేట ఉత్సవాలలో భాగంగా ఆళ్లగడ్డకు చేరుకున్న అహోబిలేసుని పారువేట ఉత్సవ పల్లకి నిత్యం ప్రజల నుండి ప్రత్యేక పూజలు అందుకుంటోంది. అందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని పాతబస్టాండ్, కర్ణమయ్యవీధి, నెహ్రూవీధి, కోర్టు, మంత్రి ఇంటి వద్ద, విద్యానగర్ తదితర ప్రాంతాలలో పల్లకి పర్యటించింది. తెలుపుల వద్ద ప్రజల నుండి పూజలందుకుంది. పల్లకిలో కొలువు దీరిన శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరదస్వామిలను దర్శించుకొని పూజలు చేశారు. పట్టణంలోని పాతబస్టాండ్ నుండి అమ్మవారిశాల బజారు వరకు తిరుణాల వాతావరణం నెలకొంది.
ఉత్సవపల్లకికి జగత్ విఖ్యాత్‌రెడ్డి పూజలు
పార్వేట ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మంత్రి ఇంటి వద్ద చేరుకున్న ఉత్సవపల్లకికి పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి పూజలు చేశారు. పల్లకిలో కొలువైన శ్రీ జ్వాలానరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వామిలను దర్శించుకుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రంతో అర్చకులు మధుసూదన్ వారిని సత్కరించారు.
మందుబాబులకు 3 రోజుల జైలు
* కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి
కర్నూలు, ఫిబ్రవరి 8:నగరంలో ఈ నెల 7వ తేదీ రాత్రి చెన్నమ్మ సర్కిల్ సెంటర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా ఏడుగురిపై కేసు నమోదు చేశామని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న ఏడుగురిని కోర్టులో హాజరు పరచగా 2వ క్లాస్ మేజిస్ట్రేట్ రఘునందన్ 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. జోహరాపురానికి చెందిన తిరుమలేష్, పాతకల్లూరుకు చెందిన మాల దాసు, ముజఫర్‌నగర్‌కు చెందిన షేక్‌యూసుఫ్, దొడ్డిపాడుకు చెందిన పెద్దఖాజా, చింతలమునినగర్‌కు చెందిన రాజేష్, బేతంచర్లకు చెందిన షేక్‌బాబు, చెంచునగర్‌కు చెందిన భాస్కర్‌లకు శిక్ష పడినట్లు ఆయన తెలిపారు.
శ్రీమఠంలో ఉడిపి పేజవర్ పీఠాధిపతి
మంత్రాలయం, ఫిబ్రవరి 8: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో జరుగునున్న శ్రీసుజరుూంద్ర తీర్థుల ఆరాధన ఉత్సవాలకు కర్నాటక ఉడిపి పేజవర్ మఠం పీఠాధిపతి శ్రీవిశే్వశ్వర తీర్థులు శుక్రవారం సాయంత్రం వచ్చారు. వారికి మఠం పీఠాధిపతి ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి సన్మానించారు. వారు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించకుని హారతి ఇచ్చారు. అనంతరం మంత్రాలయం మఠం పీఠాధిపతి ఎసుభుదేంద్ర తీర్థులు వారిని ఘనంగా ఫల, పుష్పాలు, శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు.
శ్రీ సుజరుూంద్రతీర్థుల నామపుస్తకావిష్కరణ..
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పూర్వపు పీఠాధిసతి శ్రీ సుజరుూంద్ర తీర్థుల ఆరాధన వేడుకలు పురస్కరించకుని, పూర్వారాధన వేడుకల్లో భాగంగా సాయంత్రం మఠం ప్రాకారంలో ఏర్పాటు చేసిన సభావేదికపై శుక్రవారం సాయంత్రం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు, పేజవర్ మఠం పీఠాధిపతి శిశే్వశ్వర తీర్థులు శ్రీసుజరుూంద్ర నామ పుస్తక, తెలుగు పంచాగం పుస్తకాలు, సీడీని ఆవిష్కరించారు.
ముస్తాబవుతున్న కోట్ల కార్యాలయం
* ఏర్పాట్లను పరిశిలించిన రాఘవేంద్రరెడ్డి
కోడుమూరు, ఫిబ్రవరి 8:నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కోట్ల వారసుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక యూత్ రిక్రియేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న కోట్ల కార్యాలయ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రైతుల సేవలో జిల్లా సహకార
కేంద్ర బ్యాంకు
* మేనేజర్ పులిరాజు
నందికొట్కూరు, ఫిబ్రవరి 8:రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గత వందేళ్లుగా రైతులకు సేవలందిస్తూ శత వసంతాలు పూర్తి చేసుకుందని ఆ బ్యాంకు మేనేజర్ పులిరాజు తెలిపారు. పట్టణంలోని బ్యాంకు శాఖలో శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శత వసంతోత్సవాల సంబరాలు నిర్వహించారు. తొలుత బ్యాంకులో కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మేనేజర్ మాట్లాడుతూ నందికొట్కూరు డివిజన్ పరిధిలోని 5 సొసైటీల్లో రూ. 100 కోట్ల టర్నోవర్ వుందన్నారు. 5,400 మంది రైతులకు రూ. 66కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. రూ. 34కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. రైతు నేస్తం, కర్షక జ్యోతి పథకాల కింద రైతులకు ఎకరాకు రూ. లక్ష చొప్పున రుణాలు అందజేస్తున్నామన్నారు. అన్నదాతలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పడిన బ్యాంకు వందేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లిస్తే సహకార సంఘాలు మరింత బలోపేతం అవుతాయన్నారు.