కర్నూల్

ఈవీఎంల వినియోగంపై అవగాహన పెంచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 19:రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. నగర శివారులోని దూపాడు వద్ద వున్న కేవీ సుబ్బారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులకు మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించి ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులకు ఈవీఎంల వినియోగంపై ఎటువంటి సందేహం లేకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల నాటికి ఓటు వినియోగంపై ప్రజలు 100 శాతం అవగాహన కలిగి వుండాలనే లక్ష్యంతో సెక్టోరల్ అధికారులు, బీఎల్‌ఓలు, అంగన్‌వాడీ వర్కర్లు, ప్రజలకు జిల్లా అంతటా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లతో పాటు ఈ సారి వీవీ ప్యాట్‌లను తొలిసారిగా వినియోగిస్తున్నామన్నారు. అధికారులు, రాజకీయ ప్రతినిధుల సమక్షంలో భెల్ ఇంజినీర్ల సంఘం ఆదేశానుసారం జిల్లా అంతటా ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓటింగ్ యంత్రాలను ఎలా ఉపయోగించాలి, ఓటు ఎలా వేయాలి, తాను వేసిన గుర్తుకే ఓటు నమోదైందా లేదా అని తెలుసుకునే విషయాలపై హాజరైన గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. వారి చేతనే మాక్ పోలింగ్ ద్వారా ఓటు వేయించి అవగాహన కల్పించారు. అలాగే వారి సందేహాలను నివృత్తి చేశారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయికి సంబంధించి ఈ నెల 20వ తేదీ స్థానిక కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో మాక్‌పోలింగ్ నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీలు రవిసుభాష్, మణిమాల, మెప్మా పీడీ నాగరాజునాయుడు, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖరరెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌యూలో అవకతవకలపై విచారణ జరపాలి
* రిజిస్ట్రార్ సంజీవరావుకు ఏబీవీపీ వినతి
కర్నూలు ఓల్డ్‌సిటి, ఫిబ్రవరి 19:రాయలసీమ యూనివర్శిటీలో నూతన భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వ క్వాలిటీ కంట్రోలర్‌తో విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సంజీవరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సుబ్బరామయ్య, సూర్య మాట్లాడుతూ ఆర్‌యూలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో ఏమాత్రం నాణ్యత పాటించడం లేదని, అయినా వర్శిటీ అధికారులు క్వాలిటీ కంట్రోలర్‌తో విచారణ జరపడం లేదన్నారు. అలాగే లైఫ్ సైన్సు బిల్డింగ్‌లో 4,5వ అంతస్థు కట్టడానికి రూ. 2.5 కోట్లు ఖర్చు చేస్తున్నా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. 2018లోనే పూర్తి చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకుని ఇంత వరకూ భవనాలు పూర్తి చేయలేదన్నారు. ఈ భవన నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ జరిపి ఆ పనులు చేపట్టిన ఏజెన్సీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. భవన నిర్మాణాలపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.