కర్నూల్

కర్నూలు అసెంబ్లీ స్థానానికి టీడీపీలో పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 19:టీడీపీ తరఫున కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు.. సైకిల్ టికెట్ ఎవరికి దక్కుంది.. సర్వేల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి.. సీటు రాని వారి దారెటు.. ఇదీ ప్రస్తుతం కర్నూలులో జరుగుతున్న చర్చ. కర్నూలులో ఎన్నికల వేడి రాజుకుందనేలా ఇటీవల ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్, కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య వర్గపోరు రోజు రోజుకూ ముదురుతోంది. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో గత రెండేళ్లుగా టీడీపీలో టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తన కుమారుడికే కర్నూలు సీటు కేటాయించాలని టీజీ, తనకే ఇవ్వాలంటూ ఎస్వీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. బహిరంగంగానే సమావేశాల్లో సీటు మాదంటే మాదంటూ ప్రకటనలు ఇవ్వడంతో పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని పని చేసుకోవాలని పలుమార్లు చెప్పినా సరే అంటూ పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఇటీవల జగన్నాథగట్టుపై సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం సమయంలో అభిమానుల చేష్టలతో వివాదమైంది. రహదారి పొడవునా టీజీ, ఎస్వీల ఫ్లెక్సీలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. టీజీ వెంకటేష్, భరత్ ఫ్లెక్సీలను కొందరు ఎస్వీ అనుచరులు పోలీసుల ఎదుటే చింపివేయడంతో కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందిన ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి వార్దుదర్శిని పేరుతో నగరంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తున్నారు. ఇటీవల కర్నూలు పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ బహిరంగ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎస్వీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీనిపై అలిగిన టీజీ వెంకటేష్ టీడీపీ చరిత్రలో ఎప్పుడూ ముందుగా అభ్యర్థులను ప్రకటించలేదని, అయినా టికెట్ విషయం సీఎం నిర్ణయిస్తారంటూ మాట్లాడారు. ఆ తర్వాత పార్టీ అధినేత వద్దకు వెళ్లడంతో సర్వేలో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ అని తెలిపారు. అప్పటి నుంచి వార్డుదర్శిని చేస్తున్న ఎస్వీకి పోటీగా టీజీ భరత్ విజన్‌యాత్ర పేరుతో నగరంలో పర్యటిస్తున్నారు. టీజీబీ యూత్ పేరిట వివిధ రకాల సేవా కార్యక్రమాలతో పాటు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంకూ పూర్తిగా చితికిన కుటుంబాలకు సొంత నిధులతో అర్థిక సహాయం అందిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరి వద్దకు వెళితే ఎవరు ఏమనుకుంటారో అని మధ్యలో నలిగిపోతూ ఎవరి కార్యక్రమాలకు వెళ్లకుండా తటస్థంగా ఉండిపోతున్నారు. అయితే కర్నూలు అసెంబ్లీ సీటు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
బాబు పాలనలో
అభివృద్ధి పథంలో ఏపీ
* ఎంపీ బుట్టా రేణుక
పెద్దకడబూరు, ఫిబ్రవరి 19: ఏపీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిపథంలో నడుపుతున్నారని ఎంపీ బుట్టారేణుక అన్నారు. మంగళవారం పెద్దకడబూరులో వెలసిన శ్రీ చౌడేశ్వరీదేవి 22వ జ్యోతి మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా తొగట వీర క్షత్రీయ కమ్యూనిటీ భవన నిర్మాణానికి డీఎంఎఫ్ కింద రూ.14 లక్షలను మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాబు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పని చేస్తున్నారన్నారు. ఏపీ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో నడువాలంటే చంద్రబాబును మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై పార్లమెంటులో గట్టిగా వినిపించానని, జిల్లాకు అధిక సంఖ్యలో నిధులు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేశానన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న గ్రామాలకు నిధులు కేటాయించి పరిష్కరించడానికి పాటుపడినట్లు తెలిపారు. ఎంపీగా ప్రజలకు సేవలు అందించడమే తన అశయమని, ఎమ్మెల్యేగా బరిలో నిలువాలని ఎప్పుడు అనుకోలేదన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, తర్వాత కాలంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు అంకితం కావాలని, అప్పుడే ప్రజలు గుర్తిస్తారని హితవు పలికారు. సీఎం రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇస్తున్నారని, అన్ని వర్గాల వారు బాబును ఆదరించాలని కోరారు. మరోమారు రాబోయే ఎన్నికలలో కర్నూలు ఎంపీ సీటు కోసం బాబు వద్ద పట్టుబడతానని, బాబు తనకే ఇస్తారనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తొగట వీర క్షత్రియుల కోసం 14లక్షల వ్యయంతో కమ్యూనిటీ భవనం నిర్మాణం త్వరలో మొదలు అవుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులను పంపిణీ చేశారు.