కర్నూల్

ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతీకార దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 26:పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం వాయుసేన దాడి చేసి మట్టుపెట్టడం పట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక రాజ్‌విహార్ సెంటర్‌లో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి మాట్లాడుతూ బీజేపీ హయాంలో పాకిస్తాన్‌పై రెండు సార్లు మెరుపు దాడులు జరిగాయన్నారు. గతంలో ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కార్గిల్ యుద్ధం చేసి పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పారన్నారు. నేడు సైనిక దళాలు చేసిన దాడిలో పాకిస్తాన్ తీవ్ర వాదులు హతమయ్యారన్నారు. పుల్వామా ఘనటకు ప్రతీకార చర్యగా ఈ దాడి చేయడం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి బీసీ.బీరప్ప, సూర్యప్రకాశ్, నాయకులు రంగస్వామి, సందడి సుధాకర్, బీజేవైఎం నేత సునీల్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామాధురి, తదితరులు పాల్గొన్నారు.
విజయోత్సవ ర్యాలీ
కర్నూలు : పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుని భారత్ పాకిస్తాన్‌కి హెచ్చరిక చేయడాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని భజరంగ్‌దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ టి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. బీజేపీ నగర అధ్యక్షుడు యోగానంద్‌చౌదరి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నగరంలోని ప్రధాన వీధుల్లో బాణసంచా పేల్చి భారత్ మాతాకీ జై, వందేమాతరం, నరేంద్రమోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పుల్వామా ఉగ్ర దాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుందని, ఎల్‌ఓసీలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో యుద్ధ విమానాలతో ఒక్కసారిగా ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి అలాగే 12 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కిలోల బాంబులను భారత్ ప్రయోగించిందన్నారు. ఈ వైమానిక దాడుల్లో ఎల్‌ఓసీలోని ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టమయ్యాయని, బాలాకోట్, చకోటీ, ముజఫరాబాబులో భారత్ దాడులు చేసిందన్నారు. ఎల్‌ఓసీలో భారత్ వైమానిక దాడులు చేసినట్లు పాకిస్తాన్ సర్కారు కూడా ప్రకటించిందని, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే విమానాలు వెళ్లిపోయాయని పాక్ అధికారులు ప్రకటించారని, పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోందని పాకిస్తాన్ ప్రకటించిందన్నారు. కార్గిల్ తర్వాత భారత్ వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారి అని, భారత్ సత్తా ఎంటో ప్రపంచానికి తెలిసేలా చూపించిన మన దేశ సైనికులకు ప్రతి భారతీయుడు సెల్యూట్ చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సూర్యప్రకాష్, భరత్‌కుమార్, శ్రీను, సుబ్బారెడ్డి, రంగస్వామి, ఉమామహేశ్వరప్ప, ఉదయ్‌గీత, సందడి సుధాకర్, వీరప్ప, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.