కర్నూల్

సీమ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 26: రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే జనసేన పార్టీని ఏర్పాటు చేశానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణ శివార్లలో నుండి పట్టణంలోని నాలుగురోడ్ల కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన నాలుగురోడ్ల కూడలిలో ఆయన ప్రసగించారు. తాను రాజకీయాల్లో ఏదో సంపాదించాలని రాలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందక పోవడానికి ప్రధాన కారణం ఇక్కడ 60, 40 శాతం రాజకీయం నడుస్తోందన్నారు. జిల్లాలో 269 మంది రైతులు క్రిమి సంహారక మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఏ రకంగా వుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే రైతుల గురించి టీడీపీ కానీ, వైకాపాకాని స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదన్నారు. కానీ జనసేన పట్టించుకుంటుందన్నారు. జనసేన పార్టీకి గెలుపు ఓటములతో పని లేదని, మార్పు కోసం పోరాటం చేస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే వారికి గెలుపు వుంటుందన్నారు. రాజకీయ కుటుంబాల ఆదిపత్యంతో నలిగి పోతోందన్నారు. ఈ కుటుంబాల అవినీతి కోటలని బద్దలు కొడదామన్నారు. ఆదిపత్యాలు కొన్ని కుటుంబాల చేతిలో వుంటే మార్పు సాధ్యం కాదన్నారు. మార్పు రావాలంటే సరికొత్త రాజకీయ తరం రావాలన్నారు. రాయలసీమలో మా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ముఖ్యం కాదని, మార్పు ఏ మేరకు తెస్తామన్నదే ముఖ్యమన్నారు. సీమలో మార్పు తీసుకురావాలన్న ఆకాంక్ష వుందన్నారు. కూత వేటు దూరంలో శ్రీశైలం ప్రాజెక్ట్ వుందని, కానీ ఇక్కడ నీటి సమస్య వుందని అడిగే వారే కరువయ్యారన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డగా జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొంటున్నారు, కానీ ఆయన చట్ట సభల్లో మాట్లాడరు. తెలుగుదేశం పార్టీ, భూమా కుటుంబీకులు చట్ట సభల్లో మాట్లాడరు. అధికారం అనేది అంతిమ లక్ష్యం, ప్రజలకు న్యాయం జరగాలి కానీ కుటుంబాలకు కాదన్నారు. వామపక్షాల నాయకులు కూడా సంసిద్ధం అవుతున్నాయి, మీరు కూడా సన్నద్ధులు కావాలని కోరుతున్నాం, రాయలసీమ కుటుంబాల నుండి వర్గపోరు నుండి బడుగు, బలహీన వర్గాలు బలంగా నాయకత్వం వహించాలన్నారు. కాన్షీరామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాయలసీమ మారాలన్నారు. ముస్లింలని మైనారిటీల పేరుతో ఓటు బ్యాంకు పేరుతో రాజకీయాలు చేయాలని లేదన్నారు. దేశభక్తి, దేశ సమగ్రత, భారతీయ జనతా పార్టీ హక్కు కాదని, మనందరిది అన్నారు. మీ కంటే నేను కూడా దేశాన్ని 10 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నామన్నారు. యుద్ధానికి తెర లేపడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం వుందన్నారు. నాకు రెండు సంవత్సరాల క్రితమే ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని చెప్పారన్నారు. ముస్లిం మతం దేశంలో అంతర్భాగం, ముస్లింలకు ప్రత్యేకంగా దేశభక్తి చూపాలా అంటూ ఆయన ప్రశ్నించారు. హిందువులకు ఎంత హక్కు వుందో, ముస్లింలకు అంతే హక్కు వుందన్నారు. మనదేశం అన్ని సంస్కృతులను మతాలను గౌరవిస్తుందన్నారు. పాకిస్థాన్‌లో హిందువులకు ఎంత స్థానం ఇస్తున్నారో తెలియదు కానీ, భారతదేశం ముస్లింలను గుండెల్లో పెట్టుకున్నదని, అందుకు ఉదాహరణ మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాంను భారతక్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్‌లు అని చెప్పవచ్చన్నారు. అలాంటి భారతదేశంలో ముస్లింలు దేశ భక్తిని రుజువు చేసుకోవాలన్న వాదనలు ఖండిస్తున్నామన్నారు. జనసైనికులు మతాల మధ్య గొడవలు ఆపాలన్నారు. రాయలసీమ యువత బలమైన మార్పు కోరుకుంటూ వుందన్నారు. ఆశయ సాధన కోసం ప్రాణాత్యాగానికైనా సిద్ధమని పవన్ అన్నారు. అవినీతితో నిండిన రాజకీయ వ్యవస్థను సామాన్య యువత సాయంతో ప్రక్షాళణ చేస్తామన్నారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వుండబోవు అనేలా ధీటుగా ఎదుగుతామన్నారు. తాము అధికారంలోకి వస్తే అందరికీ సమానంగా విద్య, వైద్యం అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విడదీస్తున్నారని, చిన్ననాటి నుండే కులాల మధ్య అంతరాలు పెంచుతున్నారన్నారు. చిరంజీవి 2009లో పార్టీ పెట్టినపుడు దాన్ని దెబ్బకొట్టింది కూడా అగ్రనాయకత్వమేనన్నారు. ఎన్నో ఆశయాలతో పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లో వుండలేకపోయారన్నారు. ఎంతో చేద్దామని వచ్చిన చిరంజీవికి చేయూత నివ్వలేదన్నారు. నాకు భయం లేదని, మీరిచ్చిన ధైర్యం వుందన్నారు. రైతులకు లాభసాటి ధర కల్పిస్తామన్నారు. ఓట్ల సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ల మాదిరిగా అబద్దాలు చెప్పనన్నారు. జగన్ 30 ఏళ్లు, చంద్రబాబు తమ కుమారుడు లోకేష్‌ను 30 సీఎంగా వుండాలని కోరుకుంటున్నారని, జనసేన మాత్రం ప్రజలు 30 సంవత్సరాల పాటు బాగుండాలని కోరుకుంటుందన్నారు. తనకు కిరాయి ముఠాలు లేవని, ప్రాణాలు జనసైనికులేనన్నారు. తన ఇంటిపేరు కొణిదెల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో వుండడం తన అదృష్టం అన్నారు. రాయలసీమ ఎంతటి పౌరుషానికి నిదర్శనమంటే వేట కుక్కలను కుందేల్లను తరిమిన విధంగా రాయలసీమ యువత పౌరుషం చూపాలన్నారు. వపన్‌కల్యాణ్ వెంట నాదేండ్ల మనోహర్ వున్నారు.