కర్నూల్

ఎస్సీ, ఎస్టీ భూ ఆక్రమణల పట్ల నిర్లక్ష్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 15 : ఎస్సీ, ఎస్టీ భూముల దురాక్రమణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఏపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను హెచ్చరించారు. నగరంలోని జెడ్పీ సమావేశ భవనంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, పోలీసు అధికారులు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలపై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం పట్ల కలెక్టర్, జెసిలను అభినందించా రు. ఎస్సీ, ఎస్టీల సమస్యలకు రెవెన్యూ అధికారులు చేపట్టిన పరిష్కారాల గురించి నివేదికల్లో ప్రతి అర్జీని పొందుపరుస్తూ కమిషన్‌కు సమర్పించాలన్నారు. పరిష్కారం జరిగినవే కాకుండా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలపై సత్వరమే స్పందించి ఈ నెల 31వ తేదీ లోపు పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కాకుండా ఇతరలకు పట్టాలు ఇస్తే సహించేది లేదని, జెసితో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి అలాంటి పట్టాలను రద్దుపరచి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్ భూమిని లీజుకు ఇవ్వరాదని, ఇతరులకు అమ్మరాదని అటువంటి వాటిని సాగుదారులకు అందేలా చూడాలన్నారు. ఓర్వకల్లు మండలంలోని అసైన్డ్ భూముల సాగు వివరాల గురించి ప్రత్యేక విచారణ చేపట్టి అందుకు అనుగుణంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. 1956లో రైత్వారీ పట్టా జారీ జరగకుండా ఉంటే వాటిని ప్రభుత్వ భూమిగా పరిగణించి అమ్ముకున్న వాటిని గుర్తించి వాటిని రద్దుచేసి అర్హులకు పట్టా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాగు పోరంబోకులో వుండే హక్కుదారుల కాలంలో నమోదు చేయాలన్నారు. అలాగే నివేదిక కూడా ఇవ్వాలన్నారు. రిజర్వు ఫారెస్టులో సాగు చేస్తుంటే జెసి చర్చించి తగిన విధంగా న్యాయం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీల శ్మశానవాటికల కోసం భూములను సేకరించి వాటికి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జెసికి సూచించారు. భూ సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్వాపరాల గురించి పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వాలన్నారు. జెసి హరికిరణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయంలో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించామన్నారు. అందులో 188 ఫిర్యాదులు అందగా 60 పరిష్కరించామని, 128 పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి సిబ్బంది ప్రజా సాధికారి సర్వేలో నిమగ్నమై ఉండటం వల్ల ఆలస్యం జరిగిందని, వెంటనే పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గత 17 నెలల నుంచి ప్రతి నెలా నాల్గవ సోమవారం ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ 950 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. అందులో 856 ఫిర్యాదులను పరిష్కరించామని, అందులో అన్యాక్రాంతమైన ఎస్సీ, ఎస్టీ భూములను గుర్తించి అర్హులకు ఇచ్చామన్నారు. పెండింగ్‌లో ఉన్న 68 ఫిర్యాదులను నెలలోపు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమశాఖ డిడి ప్రసాదరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి వీరఓబులు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు సుధాకర్‌రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.