కర్నూల్

బహిరంగ మల విసర్జనతో పలు సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 22:బహిరంగ మల విసర్జనతో అనేక సమస్యలు తలెత్తుతాయని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ట్రిగ్గరింగ్ డే సందర్భంగా శుక్రవారం నగరంలోని మమతానగర్, బంగారుపేట కాలనీల్లో ప్రజలకు మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్డి మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుందన్నారు. ఆరు బయట మల విసర్జన చేయటం వల్ల అనేక రోగాలు ప్రబలుతాయన్నారు. ఇంటి ఆవరణలోనే మరుగుదొడ్డి నిర్మించుకుని దానినే ఉపయోగించాలని, అలాగే మల విజర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మరుగుదొడ్ల వల్ల ఉపయోగాలే కానీ నష్టాలు ఉండవన్నారు. ఆరు బయట మల విసర్జన వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్నారు. మలం మీద ఈగలు సోకి అవే ఈగలు తినే ఆహారంపై వాలుతాయని, దీంతో పెద్దలతో పాటు చిన్న పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారన్నారు. అంతేకాకుండా డయేరియా, టైఫాయిడ్, చర్మ, కంటి సంబంధిత వ్యాధులు కూడా వస్తాయన్నారు. ముఖ్యంగా బహిరంగ మల విసర్జనతో మహిళలకు అనేక సమస్యలు తలెత్తుతాయని, కడుపులో నొప్పి, మంట, తలనొప్పి అవకాశం ఉందన్నారు. ఆరు బయట మల విసర్జనకు వెళ్లినప్పుడు క్రిమి కీటకాలైన పాములు, తేళ్లు కుట్టే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుచేసుకుని, దానిని వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపి పంచాయతీ రాజ్ ఛాంబర్స్ రాష్ట్ర నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, సులభ్ ఇంటర్నేషనల్ సభ్యులు అమిత్ గుప్తా, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.