కర్నూల్

నంద్యాల వైఎస్‌ఆర్ నగర్‌లో అనర్హుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 22: నంద్యాల పట్టణ శివారులోని వైఎస్‌ఆర్ నగర్‌లో గతంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం పంపిణీ చేసిన పట్టాల్లో పూర్తికాని గృహాలు, అనర్హుల గృహాలు కలిపి 2001గా గుర్తించినట్లు ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ నగర్‌లో 2029 ఎకరాల్ల 5 లే అవుట్లలో విడతల వారిగా 6,742 మందికి ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం ఇంటి పట్టాలు పంపిణీ చేయగా, వాటిలో బేస్‌మెంట్ వరకు, లెంటిల్ వరకు నిర్మించి వదిలి వేసినవి 559, అనర్హులు 1442 మందిని గుర్తించామని తెలిపారు. వైఎస్‌ఆర్ నగర్‌లో అనర్హులకు, నంద్యాలకు సంబంధం లేని వ్యక్తులకు అప్పటి ప్రభుత్వం, నాయకులు ఇంటి పట్టాలు పంపిణీ చేశారని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పిఎసి సమావేశంలో ఆరోపించిన విషయం విదితమే. ఈ విషయంపై కలెక్టర్ జెసిని విచారణకు ఆదేశించారు. దీంతో వైఎస్‌ఆర్ నగర్‌లో అనర్హులను, ఇంకా గృహ నిర్మాణం పూర్తి చేయని వారి జాబితాను పలు టీంలను వేసి క్షున్నంగా సర్వే చేయించామని ఆర్డీఓ తెలిపారు. వీరందరికి నోటీసులు జారీ చేస్తున్నామని, ఈ జాబితాను ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపిడిఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. నోటీసులు అందకున్న వారు, ఆయా కార్యాలయాల్లో జాబితాలను పరిశీలించి అందులో పేర్లు ఉన్న వారు మే నెల 6వ తేదీలోపు తమ అభ్యంతరాలను, వారి వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాల్సి ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ఆధారాలు, అభ్యంతరాలు తెలుపుకొనేందుకు తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెండు రెండు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యంతరాలను, ఆధారాలను పరిశీలించిన అనంతరం తుది ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అనర్హుల జాబితా ఖరారైన అనంతరం నంద్యాల పట్టణంలో సొంత ఇళ్లులేకుండ నివసిస్తున్న నిజమైన అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రుణ సహాయం కూడా చేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో ఎఓ సుధాకర్ పాల్గొన్నారు.