ఆంధ్రప్రదేశ్‌

కర్నూలుకు నిధులేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 10: కర్నూలు జిల్లాను కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2016-17వ సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాగునీటి రంగానికి రూ.7,300 కోట్లు కేటాయించినప్పటికీ అందులో ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకు దక్కింది అతి తక్కువ మొత్తమేనని వారంటున్నారు. రాయలసీమ మొత్తం మీద చూస్తే నిధుల కేటాయింపు భారీగానే ఉన్నా జిల్లా ప్రయోజనానికి మాత్రం అవి ఏ మేరకు ఉపయోగపడతాయన్నది ప్రశ్నార్థకమే. జిల్లాలో అత్యధిక కరువు ప్రాంతమైన తుంగభద్ర దిగువ కాలువ కింది రైతులకు ఉపయోగపడే విధంగా నిధుల కేటాయింపు లేకపోవడం గమనార్హం. దిగువ కాలువ సమస్యలపై అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కర్నాటక ప్రభుత్వంతో చర్చించి ఉమ్మడిగా సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రచించామని టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కాలువ ఆధునీకరణ, పంట కాలువల మరమ్మతులు, జల చౌర్యం నివారణకు నిధులు కేటాయిస్తారని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. తుంగభద్ర దిగువ కాలుకు కేవలం రూ.6కోట్లు మాత్రం కేటాయించడం అసంతృప్తికి గురి చేసింది. కరవును ఎదుర్కొనే శక్తి ఉన్న దిగువ కాలువకు అత్యంత ప్రాధాన్యతనిస్తారని భావించినా ముఖ్యమంత్రి ఆ దిశగా కృషి చేసినట్లు కనిపించడం లేదని నిపుణులు పెదవి విరుస్తున్నారు. అయితే గురు రాఘవేంద్ర పథకానికి రూ.20కోట్లు కేటాయించడం కొంత మేర సత్ఫలితాలను ఇస్తుందని వారంటున్నారు. కరవు పీడిత ప్రాంతమైన పడమర ప్రాంతంతో పాటు కేసీ కాలువ ప్రయోజనానికి ఉపయోగపడే గుండ్రేవుల జలాశయ నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సుమారు 20టిఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని తలపెట్టిన జలాశయ నిర్మాణం పూర్తయితే తుంగభద్ర జలాల సద్వినియోగంతో రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ప్రాజెక్టు అవుతుందని నిపుణులు అంటున్నారు. బడ్జెట్‌లో తెలుగుగంగ కాలువకు సుమారు రూ.78కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.504కోట్లు, గాలేరు-నగరి పథకానికి రూ.348కోట్లు, కేసీ కాలువ ఆధునీకరణకు రూ.33కోట్లు, శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు రూ.43కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో 90శాతానికి పైగా అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల ప్రయోజనానికి ఉపయోగపడుతుందని కర్నూలు జిల్లాలో పంట కాలువలు నిర్మాణానికి నిధులను వెచ్చించే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎస్సార్బీసికి కేటాయించిన నిధులు 95శాతం కడప జిల్లాకు ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాగునీటి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిధుల్లో జిల్లాకు తక్కువ వినియోగించినా ప్రయోజనం మాత్రం ఎక్కువగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. గుండ్రేవుల జలాశయ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే మరింత ఉపయోగపడేదంటున్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను వినియోగించి హంద్రీ-నీవా ప్రధాన కాలువకు అనుసంధానంగా పంట కాలువలను నిర్మించగలిగితే కరవు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని లేదంటే ఇబ్బందేనని అధికారులు భావిస్తున్నారు. సాగునీటి రంగానికి నిధులు భారీగానే ఉన్నా జిల్లాకు ఏ మేరకు ఉపయోగపడుతుందో ఇపుడే చెప్పలేమని వెల్లడించారు. ఇక జిల్లా అభివృద్ధి కోసం కర్నూలు-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (కెబిఐసి), రాజధానికి రహదారుల నిర్మాణం, ఓర్వకల్లు వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం చేపడతామని బడ్జెట్‌లో ప్రస్తావించినా నిధుల కేటాయింపులు మాత్రం వెల్లడించలేదు. రాయలసీమ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.70కోట్లు కేటాయించడం హర్షించతగ్గ విషయమని విద్యార్థులు పేర్కొంటున్నారు.