బిజినెస్

కర్నూలు అభివృద్ధికి ఆస్ట్రేలియా చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

9న పరిశీలన, ప్రభుత్వంతో చర్చలు

కర్నూలు, డిసెంబర్ 5: కర్నూలు నగర అభివృద్ధికి చేయూతనందించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈనెల 9వ తేదీన ఆ దేశ ప్రతినిధులు కర్నూలు నగరంతోపాటు శివారు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. కర్నూలు స్మార్ట్‌సిటీల జాబితాలో ఉంటుందని అంతా భావించారు.
అయితే వివిధ కారణాల నేపథ్యంలో చివరకు అమృత్ పట్టణాల జాబితాలో చేర్చారు. కర్నూలుకు స్మార్ట్ సిటీ హోదా రాకపోయినా కొత్త రాజధాని అమరావతితో సమానంగా అభివృద్ధి చేస్తానని ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు విదేశాల సహకారంతో కర్నూలు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కర్నూలు అభివృద్ధికి ఆస్ట్రేలియా ప్రభుత్వం సహకారం అందించనుందని ఆ దేశ ప్రతినిధులు ఈనెల 9వ తేదీన వస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాగా, కర్నూలు నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లు రాతి వనాల్లోని 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామికవాడ, విద్యా సంస్థల సముదాయం, విమానాశ్రయం తదితర అభివృద్ధి పథకాలను చేపట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ప్రాంతంలో కొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా కర్నూలును కలుపుతూ ఒక మహానగరం తయారవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో కర్నూలు నగర పాలక సంస్థ పరిధిని ఓర్వకల్లుకు విస్తరించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆస్ట్రేలియా ప్రతినిధులు వచ్చి వెళ్లిన అనంతరం ఆ దేశం కర్నూలు అభివృద్ధి కోసం అందించే సహకారంపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా అందించే సహకారం ఆర్థికంగా ఉంటుందా, సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తారా అన్నది తేలుతుందంటున్నారు. అయితే ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం అందించకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందుతుందని సిఎం చంద్రబాబు ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓర్వకల్లు మండలంలోని పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే ఒక జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధపడినందున అది మహానగరం అవసరాలకు తగ్గట్టుగా ఉండేలా డిజైన్ మార్చే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఆస్ట్రేలియా ప్రతినిధులు వచ్చి వెళ్లిన అనంతరం కర్నూలు నగర అభివృద్ధిపై పూర్తి స్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.