ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడవాళ్ల చేతివేళ్లు ఏకంగా ఓ కూరగాయ పేరుకే సొంతమైంది. పొడవైన గోళ్లను పెంచటం కూడా ఓ కళే. ఆరోగ్యవంతమైన, పొడవైన గోళ్లను పెంచుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. అందవిహీనంగా గోళ్లు కనబడుతున్నాయని బాధపడుకుండా కొన్ని పద్ధతులు పాటిస్తే అందమైన, పొడవైన గోళ్లు మీ సొంతమవుతాయి.
* ముందుగా గోళ్లను కొరకటం మానుకోండి. గోళ్లను ఇష్టానుసారం కత్తిరించే అలవాటును కూడా మానుకోండి. దీనివల్ల గోళ్లను అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
* ఆలివ్ ఆయిల్‌ను ముంచిని దూదితో తరచూ గోళ్లను శుభ్రం చేసుకుంటే మంచిది. ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే గోళ్లు నాజుగ్గా తయారవుతాయి.
* గోళ్లను కొరకటం వల్ల అవి పగిలిపోయి ఒక్కొక్కసారి రక్తం వస్తుంది. అంద విహీనంగా మారతాయి.
* గోళ్ల సందుల్లో మురికిని తొలగించటానికి సూదులు, పుల్లలను వాడటం మంచిది కాదు.
* రోజూ వీలైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగితే మేని ఛాయతో పాటు గోళ్లు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి.
* విటమిన్లు, కాల్షియం అధికంగా లభించే ఆహారం తీసుకుంటే గోళ్లు అందంగా పెరుగుతాయి.
* పెద్దలు గోళ్లు అందంగా కనిపించాలనే గోరింటాకు పెట్టేవారు. కాని నేడు గోరింటాకు పెట్టడం లేదు. అందరూ గోళ్లరంగులనే వాడుతున్నారు. గోళ్ల రంగును ఎంపిక చేసుకునేటపుడు నాసిరకంవాటిని కొనుగోలు చేస్తే గోళ్లు పాడవుతాయి. గోళ్లు పుచ్చకుండా చూసుకోవాలి.