బిజినెస్

ధ్రువతారలా వెలుగుతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక సంస్కరణలపై ప్రశంసలు కురిపించిన ఐఎమ్‌ఎఫ్ చీఫ్ లగార్డే
న్యూఢిల్లీ, మార్చి 12: భారత్‌లో నిరాటంకంగా కొనసాగుతున్న సంస్కరణల ప్రక్రియను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే శనివారం అభినందించారు. అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ వృద్ధిపథంలో దూసుకెళ్తోందంటూ ప్రశంసించారు. ధ్రువతారలా వెలిగిపోతోందని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ-ఐఎమ్‌ఎఫ్ సంయుక్తంగా ఇక్కడ నిర్వహిస్తున్న అడ్వాన్సింగ్ ఆసియా సదస్సులో ఐఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లగార్డే మాట్లాడారు.
ఆర్థిక మందగమనంలోనూ రాబోయే నాలుగేళ్లకుపైగా కాలంలో ప్రపంచ వృద్ధిలో మూడొంతుల్లో దాదాపు రెండు వంతుల వృద్ధిని సాధించేగలిగే సామర్థ్యం భారత్‌కుందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా జిడిపిని పరుగులు పెట్టిస్తున్నది భారతేనని, ఇక్కడి యువశక్తి ఇందుకు కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం ఆసియా దేశాల్లో పెట్టుబడులు అవసరమన్న ఆమె భారత్‌లో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఆలోచనలపై పొగడ్తలు కురిపించారు. మున్ముందు కూడా మరిన్ని సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఆసియా అత్యంత కీలకమైన ప్రాంతమని, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 40 శాతం ఆసియా దేశాలదేనని గుర్తుచేశారు. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కాగా, చైనా కరెన్సీ యువాన్ విలువ మున్ముందు భారీగా తగ్గే అవకాశాలు లేవని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న చైనాకు యువాన్ విలువ ఒడిదుడుకులు కూడా తలనొప్పిగా మారగా, వృద్ధిరేటుపరంగా చైనాను భారత్ త్వరలోనే మించిపోగలదన్న అభిప్రాయాలు గత ఏడాదే ఐఎమ్‌ఎఫ్ నుంచి రావడం గమనార్హం.
మరోవైపు ఓ రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు భారత్-ఐఎమ్‌ఎఫ్ మధ్య ఒప్పందం కుదిరింది. స్థూల ఆర్థిక, ఇతరత్రా ఆర్థిక అంశాలలో సవాళ్లను ఎదుర్కోవడానికి అధికారులలో తగిన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణా కేంద్రం ఉపయోగపడనుంది. అయితే అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతమైన ద్రవ్యవిధానాలతోనే భారత్ తదితర ఆసియా దేశాలు ఎదుర్కొనగలవని, ఆ దిశగా ముందుకెళ్ళాలని లగార్డే సూచించారు.