బిజినెస్

రూ. 11.5 కోట్లతో 40 వేల క్యాప్ ల్యాంప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్మికుల కోసం సింగరేణి కొనుగోలు * త్వరలో మరో 7 వేలు సరఫరా
హైదరాబాద్, నవంబర్ 21: సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికుల రక్షణకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలను కల్పించేందుకు సంస్థ నడుం బిగించింది. కార్మికులు విధి నిర్వహణలో భాగంగా గనుల్లో పనిచేసే సమయంలో అవసరమైన అత్యంత తేలికైన 40 వేల టోపీ దీపాల (క్యాప్ ల్యాంప్)ను రూ. 11.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శనివారం తెలిపింది. మరో ఏడు వేల టోపీ దీపాలను త్వరలోనే కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
సింగరేణి కార్మికులు ప్రస్తుతం వాడుతున్న టోపి దీపాల బరువు 2 కేజీలపైనే ఉంటుందని, నడిచేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండేదని సంస్థ వెల్లడించింది. అయతే ఆధునాతన దీపాలు 600 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయని, దీంతోపాటు గత దీపాలకన్నా ఎక్కువ కాంతిని కలిగిస్తాయని వివరించింది. అలాగే లైటింగ్‌ను ఎక్కువ, తక్కువ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుందని, వీటి బ్యాటరీల్లో యాసిడ్ పోయాల్సిన అవసరం లేదని చెప్పింది. కాగా, బరువు తక్కువ కలిగిన క్యాప్ ల్యాంప్‌లను సమకూర్చడం పట్ల కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.