క్రీడాభూమి

అఫ్గాన్‌పై లంక అలవోక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 17: టి-20 వరల్డ్ కప్‌లో గురువారం అఫ్గానిస్థాన్‌ను ఢీకొన్న శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో సునా యాసంగా గెలిచింది. తిలకరత్నే దిల్షాన్ అజేయంగా 83 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపాడు. 154 పరుగుల లక్ష్యాన్ని లంక మరో 11 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది.
టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకొని, 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేయగలిగింది. కెప్టె న్ అస్గర్ స్టానిక్‌జయ్ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 47 పరుగులు సాధించా డు. అతనికి తోడుగా సమీయుల్లా షెర్వానీ కూడా కొంత సేపు లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అతను కేవలం 14 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించాడు. నూర్ అలీ జర్దాన్ 20 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తిసర పెరెరా 33 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. రం గన హెరాత్ 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
అఫ్గాన్‌ను ఓడించి, ఇటీవల కాలంలో ఎదురవుతున్న వైఫల్యాలకు అడ్డుకట్ట వేయాలన్న పట్టుదలతో ఉన్న శ్రీలంక 41 పరుగుల స్కోరువద్ద వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ చండీమల్ (18) వికెట్‌ను కోల్పోయంది. అతను షమీయు ల్లా షేర్వానీ క్యాచ్ అందుకోగా మహమ్మద్ నబీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దిల్షాన్ దిల్షాన్ క్రీజ్‌లో నిలదొక్కుకోవ డంతో వికెట్ల పతనం వల్ల లంకకు నష్టమేమీ జరగలేదు. లాహిరు తిరిమానే (6), బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ల భించిన తిసర పెరెరా (12), చమర కపుగడెరా (10) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయతే, ఫోర్త్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఏంజెలో మాథ్యూస్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, దిల్షాన్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 3.4 ఓవర్లలో అజేయంగా 42 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, లంకకు అత్యవసరంగా మారిన విజయాన్ని అందించారు.