లారెన్స్ కోటి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరస వర్షాలతో అతలాకుతలమైన చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు చలనచిత్ర రంగం చేయూతనిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు ఇప్పటికే తమవంతు సహాయం అందించారు. కాగా దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తాజాగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు చిత్రసీమకు చెందిన అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ప్రభాస్, కృష్ణంరాజు రూ. 15 లక్షలు, ఏపీలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం రూ. 5 లక్షలు ప్రకటించారు. ‘శ్రీమంతుడు’ చిత్ర నిర్మాతలు రూ. 5లక్షలు ప్రకటించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా శుక్రవారంనాడు చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జలమయమైన ప్రాంతాల్లో పడవలో పర్యటించిన ఆయన లిటిల్‌ఫ్లవర్ అంధుల పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు దగ్గరుండి అందజేశారు. కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి ఖుష్బుకూడా పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. వారికి అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. వారితో కలసి తిరిగి బాధితులకు ధైర్యం చెప్పారు.