ఆటాపోటీ

అదరగొట్టిన లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాత్మక ఆటకేగానీ పవర్ ప్లేకు ఏమాత్రం పనికిరాడన్న ముద్ర పడిన హైదరాబాద్ స్టయిలిస్టు బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ తనదైన రోజున వనే్డల్లోనూ విజృంభించగలనని నిరూపించుకున్న మ్యాచ్ 2004 జనవరి 18న బ్రిస్బేన్‌లో జరిగింది. అతను అజేయంగా 103 పరుగులు చేయగా, సచిన్ తెండూల్కర్ 86, రాహుల్ ద్రవిడ్ 74 పరుగులతో భారత్‌కు అండగా నిలిచారు. వీరి ప్రతిభ కారణంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు మొట్టమొదటిసారి ఒక వనే్డలో 300 పరుగుల మైలురాయిని అధిగమించింది. 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 303 పరుగులు చేసింది. ఆసీస్‌లో ఆస్ట్రేలియా జట్టుపై భారత్‌కు ఇప్పటికీ అదే అత్యధిక స్కోరు. ఆతర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హేడెన్ 109 పరుగులు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. మైఖేల్ క్లార్క్ (42), మైఖేల్ బెవాన్ (41 నాటౌట్) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆసీస్‌కు 19 పరుగుల తేడాతో పరాజయం తప్పదలేదు. లక్ష్మీపతి బాలాజీ 48 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఇర్ఫాన్ పఠాన్ 64 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. వేగంగా పరుగులు చేయగలనని లక్ష్మణ్ నిరూపిచుకోవడమే ఈ మ్యాచ్‌లో ప్రధానాంశం.