కృష్ణ

రాష్ట్రంలో 3కోట్ల ఎల్‌ఈడి బల్బుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జలవనరుల శాఖ మంత్రి ఉమ వెల్లడి
మైలవరం, నవంబర్ 26: రాష్ట్రంలో నిరంతరం విద్యుత్‌ను అందించేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల ఎల్‌ఈడి బల్బులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఆయన మైలవరంలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటైన సభలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు గానూ విద్యుత్‌ను పొదుపు చేసే ఎల్‌ఈడీ బల్బులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఈకార్యక్రమం వల్ల 33శాతం విద్యుత్ ఆదా అవుతోందన్నారు. వర్షాలు కురవక అల్లాడుతున్న పశ్చిమ కృష్ణా రైతుకు గోదావరి జలాలతో పంట భూములను సస్యశ్యామలం చేయనున్నట్లు మంత్రి ఉమా వెల్లడించారు. పట్టిసీమ నీటిని ఇప్పటికే కృష్ణా నదిలో కలపటం ద్వారా ఈప్రాంతంలోని దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఈనీటితో ఒక్క ఎకరాను కూడ ఎండనివ్వబోమన్నారు. అదేవిధంగా పట్టిసీమ నీటిని నాగార్జున సాగరు ఎడమకాలువపై ఉన్న 117వ కిలోమీటరు వరకూ రప్పించేందుకు అవసరమైన కాలువ నిర్మాణానికి సంబంధించి సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత కాలువ నిర్మాణం చేపట్టి పశ్చిమ కృష్ణాలోని మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలలోని ఎనిమిది లక్షల ఎకరాలను పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని వల్ల దాదాపు రెండువేల కోట్ల రూపాయల విలువైన పంట పండబోతోందని వెల్లడించారు. ఈవిధంగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని తాము ముందుకు తీసుకెళుతుంటే ఒక పార్టీ తన అవినీతితో పెట్టిన పత్రికను అడ్డుపెట్టుకుని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని వారికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 30వేల బల్బులు పంపిణీ చేశామని విద్యుత్ సర్వీస్ ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు బల్బుల చొప్పున పంపిణీ చేయటానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ బుల్లిబాబు, వైస్ చైర్మన్ నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ సీఈ వెంకటేశ్వర్లు, ఏడీఈ మురళీకృష్ణ, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, సర్పంచ్ కృష్ణవేణి, తహశీల్దార్ కెవి శివయ్య తదితరులు పాల్గొన్నారు.