ఉత్తరాయణం

చట్టాల అమలుపై చర్చించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రస్తుతం 30వేల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇవి ప్రజా జీవితంలో దాదాపు అన్ని పార్శ్వాలను స్పృజిస్తున్నాయి. ఉదాహరణకు గోహత్యను దాదాపు 12 రాష్ట్రాలు నిషేధించినప్పటికీ, చట్టం మాత్రం అమలు కావడంలేదు. అదేవిధంగా వరకట్న నిషేధ చట్టం, జంతువుల హింస నిషేధ చట్టం, తప్పుడు మార్గాల్లో మత మార్పిడులు వంటివి. అందువల్ల ప్రభుత్వాలు, పార్లమెంటు శాసనాలు తయారు చేసే కర్మాగారాలుగా కాకుండా, చేసిన శాసనాలను ఏవిధంగా సమర్ధవంతంగా అమలు పరచాలన్నదానిపై చర్చలు జరపాలి. ఉదాహరణకు విద్యాహక్కు, ఆహార భద్రతా హక్కు, ఎన్‌ఆర్‌ఇజి వంటి పథకాలు పెద్ద మొత్తంలో ప్రజల ధనం వ్యయంతో కూడినవి. ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడం వల్ల అవి ఆమోదానికి నోచడం లేదు. దీనికి అంతూపంతూ లేకుండా ఉన్నది. అందువల్ల కొత్తబిల్లులు ప్రవేశపెట్టడం ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం వంటివి పదేపదే చోటు చేసుకునేదానికంటే, సమాజానికి అత్యంత ముఖ్యమైన చట్టాల అమలును ఏవిధంగా చేపట్టాలనేదానిపై చర్చలు జరపడం మంచిది.
- టి. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

మూడో ఘాట్ రోడ్డు అవసరం
తిరుమల కొండపైకి మొదటి ఘాట్ రోడ్డు మోక్షగుండం విశే్వశ్వరయ్యగారి సలహా మరియు పర్యవేక్షణలో జరిగింది. రెండవ ఘాట్ రోడ్డు సరియైన నిపుణుల పర్యవేక్షణలో జరుగలేదు కనుకనే ఇబ్బందులు ఎదురవుతున్నాయ. 1999 నుంచి రెండవ ఘాట్ రోడ్డు ఒడిదుడుకులను, ప్రమాదాలను ఎదుర్కొంటున్నది. ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా వీలయనంతవరకు సరైన మూడ వ ఘాట్ రోడ్డను నిర్మించడం మంచిది. ఏవిధంగానైనా సరే ఈ రెండవ ఘాట్ రోడ్డును మూసివేసే సూచనలు కనిపిస్తున్నాయ. చంద్రగిరి నుంచి తిరుమల కొండ మీదకు దారి ఉంది. దానిమీద లారీలు మాత్రమే తిరిగేవి. నిపుణుల పర్యవేక్షణలో ఘాట్ రోడ్డును అటువైపు విస్తరించడం మంచిది కావచ్చు. టిటిడి, ప్రభుత్వం సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు రూపొందించి తిరుమల యాత్రకు అడ్డంకులు లేకుండా చూడాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం

కృషి ఉంటే...
ఆమధ్య మన ముఖ్యమంత్రిగారు ఆత్మహత్యలను ఆపడం ఎలా? అని ఒక సదస్సులో విద్యార్థులను అడిగారు. పాపం వారికేం తెలుస్తుంది. ఆత్మహత్యలు ఆగాలం టే ఈ క్రింది సూచనలు అమలుచెయ్యాలి.
1) ప్రభుత్వం రైతుల దగ్గర భూమిని కౌలుకు తీసుకోవాలి. 2) ఉపాధి హామీ పథకం ద్వారా ఆ భూమిలో లేదా ఇతర భూములలో వారిచే వ్యవసాయం చేయించాలి. 3) ఇందుకు మండల-రాష్ట్ర స్థాయిల్లో ఉన్న వ్యవసాయ శాస్తవ్రేత్తలను అధీకృత రైతులుగా నియమించాలి. 4) పెట్టుబడి, పురుగు మందులు, ఇతర ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. 5) వ్యవసాయం అనంతరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మద్దతు ధర ప్రకటించి ఆ పంటలను ప్రజలకు అందించాలి. 6) ఆ తరువాత ఏమైనా ఆ లాభాలు వస్తే ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. లేదా వేరే వృత్తి వ్యాపారాలు చేసుకోమని చెప్పాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అమలుచేస్తారా?
- కొసనా మధుసూదనరావు, రోళ్ళపాలెం

సనాతన ధర్మం విస్తరించాలి
సనాతన ధర్మాన్ని అన్నివైపులా విస్తరించాలి. కేవలం పూజలే కాకుండా పండితులచే ప్రవచనాలు ఏర్పాటుచేయాలి. నెలకొకసారి ప్రతీ హిందూ దేవాలయాలలో లలితా సహస్ర నామంతో కుంకుమ పూజ, గీతాపఠనం, పురాణ ప్రవచనం ఉండాలి. మత మార్పిడులను పూర్తిగా నిషేధించాలి. పరమత సహనం సనాతన ధర్మం యొక్క అభిమతం. ఏ హిందూ పాలకుడు ఏ ప్రార్థనా మందిరాన్నీ కూల్చలేదు. మొగల్ పాలకులైన షాజహాన్, ఔరంగజేబు, గజినీ మహమ్మద్, గోరీ మహమ్మద్, నాధీర్‌షా లాంటి వారు ఎన్నో దేవాలయాలు కూల్చి ధనాన్ని కొల్లగొట్టారు. దేవాలయ ఆదాయాన్ని తమ స్వంతానికి వాడుకున్నారు.
- కె.మణి, కంచరపాలెం

మాటల గారడీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుది ఓట్లు- సీట్లు పైనే గురి. దానికొరకే పనులు చేయిస్తారు. ప్రజల కొరకు కాదు. స్పష్టంగా కనపడుతున్నది. రోడ్ల మరమ్మత్తుకు 500 కోట్లు. ఇప్పటికే 5 కోట్ల మంది 60 సంవత్సరాలు పైబడినవారి నడుము నడ్డి విరిగింది. సికింద్రాబాద్ నుండి చార్మినార్ చౌరస్తావరకు టూవీలర్ నడిపిస్తే నడుము విరగడం నొప్పి రావడం ఖాయం.. ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న సిఎం. ప్రతి దాని మీద రాజకీయం చేస్తున్నారు. అది పండుగ కావచ్చు. సంప్రదాయాలు కావచ్చు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఉపాధ్యాయులు ఉద్యోగాలు వస్తాయి అని ఆశపెట్టుకున్న వాళ్ళకి ఏమి ఇచ్చారు. ఇంకెన్ని సంవత్సరాలు సమాజాన్ని విభజిస్తారు? మాటలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు?
- జి.జగదీశ్వర్, భారతీయ శిక్షణ మండల్, హైదరాబాద్

సీనియారిటీ చూడాలి
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. కాబట్టి గత ఏడాది జరిగిన గ్రంథాలయ అటెండర్ పరీక్షా ఫలితాల ప్రకారం, ఇంటర్వ్యూలను రద్దుచేసి, 12 మార్కులను ఎం ప్లాయ్‌మెంట్ సీనియారిటీకి కలిపి సెలెక్షన్ జాబితా విడుదల చేయాలి. ఇంటర్వ్యూకోసం ఎంపికైన నిరుద్యోగులందరు, ఎంప్లాయ్‌మెంట్ సీనియారిటీని చూడాలని కోరుతున్నారు.
- తల్లెడ వనజాక్షి, రాయదుర్గం