ఉత్తరాయణం

పింఛనుదార్ల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాలు వితంతువులు, వికలాం గు లు, వృద్ధులకు నెలనెలా పింఛన్లు చెల్లిస్తున్నాయ. విచిత్ర మేమంటే వీరంతా పింఛను చెల్లింపు కార్యాలయానికి ప్రతి నెలా తప్పనిసరిగా హాజరై తమ పింఛను తీసు కోవాల్సి వస్తున్నది. ఉద్దేశపూర్వకంగా కాకపోయనా, తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొన్న నిబంధన వీరిని ఇబ్బందుల పాలు చేస్తున్నది. వీరికి చెల్లించే పింఛను మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమజేయవచ్చు కదా. జన్‌ధన్ యోజన వంటి ఖాతాలు వీరికి లేనట్లయతే, అటువంటి ఖాతాలను తెరవడం వల్ల, పింఛన్లను నెలవారీగా వారి ఖాతాల్లో జమచేయవచ్చు. ఏడాదికోమారు బ్యాంకు అధికారివద్దకు హాజరై తాము జీవించే ఉన్నట్టు ధ్రువీకరించవచ్చు. అంతేకాని నెలనెలా పింఛను చెల్లింపు కార్యాలయం వద్ద పెద్ద క్యూలలో గంటల తరబడి నిలబడి తమ పింఛను పొందడమనే ప్రకియ అసంబద్ధంగా తోస్తున్నది.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు తగదు
మతం మారిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. మతం మారిన దళితులకు రిజర్వేషన్ల వలన నిజమైన దళితులకు అన్యాయం జరగడమే కాక, మతం మార్పిడిని ప్రోత్సహించినట్లవు తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం రాజ్యాంగ వి రుద్ధమైన చర్యలను నిజమైన దళితులు ఖండించాలి. హిం దూమత దళితులకు మాత్రమే రిజర్వేషన్లు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పివుంది.
- వేదుల జనార్ధనరావు, వంకావారిగూడెం

పరిశోధనలు సాగాలి
దంత వైద్యంలో ఇంప్లాంట్స్ విధానం వచ్చింది కాని ఇది చాలా ఖరీదైనది. సామాన్యులకు అందుబాటులో లేనిది. అట్లా కాకుండా దంతాలు పూర్తిగా కోల్పోయ తినడానికి ఇబ్బంది పడుతున్న వారికి వరప్రసాదంగా పేషెంట్ చిగుళ్లనుంచి దంతాలు మొలిపించే ప్రక్రియను కనిపెట్టాలి. దంతవైద్యులు, పరిశోధకులు ఈ విషయంపై పరిశోధనలు కొనసాగించాలి.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్

ఈ నివేదిక దేనికోసం?
విచారణ కమిషన్‌ను నియమించడం అంటే కాల యాపనకే, లేదా తమకు అనుకూలమైన నివేదిక సాధించడానికే నన్న సంగతి అందరికీ తెలిసిందే. సాధా రణంగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని నియ మిస్తారు. కాని డిడిసిఏలో జరిగిన అవకతవకలను విచారించడానికి కేజ్రీవాల్ ఒక న్యాయవాదిని నియమిం చారు. ఆయన నెలకు కేవలం రూపాయ మాత్రమే ఫీజు తీసుకుంటాడట. న్యాయవాదులు న్యాయం తరపునే ఉంటారని అమాయకులు కూడా భావించరు. గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునే రాంజఠ్మలాని, కపిల్ సిబల్ ఎవరితరపున ఏమని వాదించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా జైట్లీ దోషి అనే నివేదిక వస్తుంది.
- ప్రసాద్, గొడారిగుంట, తూ.గో. జిల్లా

కాంట్రాక్టు న్యాయ సిబ్బంది ఇక్కట్లు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 253 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవహారాల శాఖ ద్వారా 2011లో ఈమేరకు జీవోఎంఎస్ నెం.88ను జారీ చేసింది. దీని ప్రకారం స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులు, స్పెషల్ మెట్రొపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు, స్పెషల్ మెట్రొ పాలిటన్ కోర్టు (మార్నింగ్ కోర్టు) ఉంటాయ. ఆంధ్ర ప్రదేశ్ జ్యూడిషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ నుంచి పదవీ విరమణ పొందిన వారికి లేదా ఇతరత్రా అర్హులైన వారికి కాంట్రాక్టు విధానంలో నేరుగా ఇతర కేటగిరీల్లో సిబ్బంది నియామకాలు జరిగాయ. అయతే కాంట్రాక్ట్ కోర్టు, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు డిప్యుటిషనన్‌లు రద్దు చేయాలి. రెగ్యులర్ కోర్టులకు కాంట్రాక్ట్ న్యాయశాఖ సిబ్బందికి డిప్యుటేషన్ రద్దు చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఆదేశాలివ్వాలి. 13వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ పథకం కింద నడిచే కాంట్రాక్ట్ కోర్టు సిబ్బందికి డిప్యుటేషన్లు రద్దు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) ఈమేరకు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జి.ఒ. విడుదల చేయాలి. 13వ ఆర్థిక సంఘం నిధులతో స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు సిబ్బందికి జడ్జి, అటెండర్, హెడ్‌క్లర్క్‌ల జీతాలు పెంచారు. కాని టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్ల జీతాలు పెంచలేదు. పాత జి.ఒ. ప్రకారం అదే డేట్ నుంచి బడ్జెట్ కేటాయంచి జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు జీతాలు పెంచి ఇవ్వాలి. కేంద్ర న్యాయశాఖ, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), హైకో ర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు న్యాయశాఖ సిబ్బంది సమస్యల పట్ల స్పందించాలి.
- కె. గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు

నేరచరితులను ఎన్నుకోవద్దు
‘నేర చరితులతో భ్రష్టు పడుతున్న రాజకీయాలు’ శీర్షికన వచ్చిన లేఖలోని అంశాలన్నీ నిజమే. ప్రజల ఆవేదన కూడా అదే. అయతే ఇంకా లోతుగా ఆలోచిస్తే నేర చరితులకు ఓట్లు వేసి గెలిపిస్తున్నది మనమే కదా. నేరగాళ్లకు శిక్ష పడకుండా రక్షించేందుకు, ఒకవేళ శిక్షపడితే బెయల్ మీద విడిపించేందుకు కృషి చేస్తున్నది మన లాయర్లే కదా. బెయల్ మీద బయటకు వచ్చిన నేరగాడు మనకే సుద్దులు చెబుతూ ఉంటే వెర్రి గొర్రెల్లా జయజయ ధ్వానాలు చేసేది కూడా మనమే కదా. నేరగాళ్లని హీరోలు చేసి పుస్తకాలు రాసి అవార్డులు కొట్టేస్తున్నది కూడా మన మహా రచయతలే కదా. ‘యధా రాజ తథా ప్రజ’ అన్న సూక్తిలో కొంత నిజం ఉంది కాని, ‘‘ఎలాంటి ప్రజలకు అలాంటి నాయకులే కదా దొరుకుతారు’’ అన్న సూక్తిలో ఎంతో నిజం ఉంది.
- శుభ, కాకినాడ