ఉత్తరాయణం

బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్‌లు సమర్పించారు. కాని ఆంధ్రప్రదేశ్‌కు గాని, మధ్యతరగతి ప్రజలకు గాని, పేదలకు గాని, నిరుద్యోగులకు గాని మేలు జరిగింది లే దు. ముఖ్యంగా ఆంధ్రకు ఇస్తామన్న విశాఖ రైల్వేజోన్ మాట లేదు. ప్రత్యేక హోదా వూసే లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర కరువు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు లేవు. మన ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. వెంకయ్యగారు మాట్లాడలేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మభ్యపెట్టి తమ పార్టీలోకి చెర్చుకోవడంలో తలమునకలైనారు. కొన్ని కోట్ల రూపాయలు రాజధానికని నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. మంత్రులు, బంధువులు, బంధు జనా లు, రియల్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుర్తించినట్టు లేదు. సాయం చేయక పోయనా ఆంధ్ర ముఖ్యమంత్రి పట్టించుకోరని తెలుసు కున్నారు. ఇకనైనా స్వంత లాభాలు మాని, ప్రజలకు రావలి సిన సదుపాయాలు, ప్రత్యేక హోదా, రుణమా ఫీలు, నిరు ద్యోగ నివారణ, ధరల పెరుగుదలపై దృష్టి పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తి డి తేవాలి.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు
మాల్యా ఇంద్రజాలం
మామూలుగా ఇంద్రజాల ప్రదర్శనల్లో మహా అయతే టోపీలోనుంచి కుందేలును తీసి చూపుతారు. కానీ విజయ్ మాల్యా బ్యాంకులకు టోపీ వేసి అందులోంచి వేలకోట్ల రూపాయలు లాఘవంగా తీసేశారు. అలా తీయడం ఆయన ఘనకార్యమే అయనా, మరీ అంత సులభంగా, అమాయకంగా బ్యాంకులు తమ లాకర్లు తెరచి మరీ ఎలా సహకరించాయంటూ సుప్రీంకోర్టే విస్తు బోయంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వమూ కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ పట్టుకొందామనే యత్నంలో ఉండగా..మాల్యా చక్కగా దేశంనుంచి మాయమై పోయారు. ఇది ఆయన ఘనతగా భావించి ‘మహా మాయామేయ మాల్యా మహాశేయ’ అని బిరుదునిచ్చి సత్కరిద్దామా? లేక మన్నుతిన్న పాముల్ని మించిన దర్యాప్తు సంస్థలున్న మన వ్యవస్థను నిందిద్దామా? ఏదైనా ఆయన దయతలచి స్వదేశానికి వచ్చినప్పుడు కదా, వీధిన పడ్డ కింగ్‌ఫిషర్ ఉద్యోగులు, వేలకోట్ల నష్టాన్ని బ్యాంకుల తరపున పరోక్షంగా మోయబోయే సామాన్య ప్రజలు ఏమైనా చేయగలిగేది. అంతవరకు చేయగలిగేదేముంది?
-డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
వివాదాల విశ్వవిద్యాలయాలు
కనీసం పదివేలు మంది విద్యార్థులకు తన స్వంత నిధులతో విద్యాబోధన చేసే వ్యక్తిని కులపతిగా నిర్వచించారు. కానీ నేడు కులపతుల ఎన్నిక కులప్రాతిపదికగా చేయడం అన్నది 60 సంవత్సరాల గత పాలకుల కులనీతి చిహ్నం అయింది. విసీ మావాడు కాబట్టి మేం రెచ్చిపోతాం అనే చందాన గత దశాబ్దకాలంగా విశ్వవిద్యాలయాలలో కుర్రాళ్లు కుప్పిగంతులు వేస్తున్నారు. ఫీజు చెల్లింపు విధానం వల్ల అతి కొద్దిమంది విద్యార్థులు దారి తప్పి బాధ్యత వదిలి విశ్వవిద్యాలయాలలోకి రాజకీయాలను పూర్తిగా చొప్పించే బాధ్యత తీసుకున్నారు.ఇటీవల దేశద్రోహి యాకుబ్‌మెమెన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఉరి తీయమని ఆదేశించగా జాతీయ ప్రభుత్వం ఉరిని అమలుచేసింది. ఒక యాకుబ్‌ను చంపితే వంద యాకుబ్‌లను పుడతారు అని ర్యాలీ చేసిన యువకులు, ఆ తీర్పును అబేద్కర్ ప్రవచిత రాజ్యాంగం ద్వారా విస్తృత అధికారాలు దఖలుపడ్డ కోర్టు ఇచ్చిన తీర్పు అని గుర్తుకు రాలేదా? సమకాలీన ప్రపంచంలో అవమానాలు పొందిన బిఆర్ అంబేద్కర్ ప్రస్తుత కాల విద్యార్థులలాగ ఆత్మహత్య చేసుకుంటే ఈనాడు ఆయన గురించి గొప్పగా చెప్పే అవకాశం వుండేది కాదు. చేను మేసే లక్షణం ఉన్న కొందరు విద్యార్థుల్లో తాము ఈ దేశంలో భాగం కాదు అనే భావజాలాన్ని ఎక్కించారు. తాము హిందువు ఎట్లవుతా అనే వ్యక్తులు అంబేద్కర్ తను హిందువే అని, కానీ బౌద్ధుడుగా మారాడన్న సత్యాన్ని గుర్తిం చాలి. దళిత పదాన్ని కోర్టు 17-3-2008న నిషేధించింది. ఈ విషయం విజ్ఞులు గుర్తించాలి.
-పి.ఆర్.వి.ఎస్.ఆచార్యులు, నక్కపల్లి, విశాఖ
ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు
హైటెక్ సిటీ, హకీంపేట వైపునుంచి వచ్చీపోయే సిటీ బస్సుల్లో వచ్చే ప్రయాణీకులు సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే దారి రెండు మూడు వందల మీటర్లయినా దారంతా బస్సులు, కార్లు ఆటోలతో, జనాలు ఎదురెదురుగా రావడంతోను ఆడవారు, పిల్లలు తమ లగేజీలతో స్టేషన్‌కు చేరాలంటే చాలా కష్టమవుతున్నది. ఈ దారి వెంబడి రోడ్డు పక్కన తోపుడు బండ్ల వ్యాపారులు, ఓ పెట్రోల్ బంకు వుండడంతో ఇంకా యాతనగా వుంది. ఆడవారికి సేఫ్టీ ఏమాత్రం లేదు. ఈఅవస్థలు స్టేషన్ ముందు, రేతిఫైల్ బస్టాండ్‌లలో ఆగేవాటికి లేవు. జిహెచ్‌ఎంసి వారు సర్వేచేసి రోడ్డును వెడల్పు చేయడంగానీ, పాదచారులకు మాత్రమే ఓ మార్గం ఏర్పరచాలని మనవి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
క్రమబద్ధీకరణ అనవసరం
గెజిటెడ్ హోదాగల కళాశాల అధ్యాపకులను కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి నియమించటం న్యాయబద్దమైనది. సరియైనది కాని ప్రిన్సిపాల్ అధ్యాపకుల కొరత నివారించడానికి తాత్కాలికంగా మొక్కుబడిగా నియమించుకొన్న వారిని క్రమబద్ధీకరించి గెజిటెడ్ లెక్చరర్ ఉద్యోగాలిస్తాననడం సరియైన విధానం కాదు. క్రమబద్దీకరణ అనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. లక్షలాది నిరుద్యోగ పిజిలు, ఫిలాసఫర్లు, డాక్టరేట్స్ సబ్జెక్టు గోల్డ్ మెడలిస్ట్స్ నిరాశ నిస్పృహలతో కాలం వెళ్ళదీస్తున్న ఈనాటి కాలంలో
పి.యస్.సి. సి.యస్.సి.ల ద్వారా మాత్రమే గెజిటెడ్ పోస్టులనివ్వాలి.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు,
కరీంనగర్