ఉత్తరాయణం

బంగారు తెలంగాణ సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2016...17 తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ప్రారం భిస్తూ గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యా లను ఉభయ సభల్లో ఆవిష్కరించిన తీరు బాగా ఉంది. తాగునీరు, సాగునీరు, నీటి ప్రాజెక్టులు, జలవనరుల వినియోగం, మిషన్ కాకతీయ రెండోదశ కార్యక్రమాలు, మిషన్ భగీరథ లక్ష్యాల సాధన దిశగా కదిలితే బంగారు తెలంగాణ సాధ్యమే. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేయాలి. తెలంగాణ గ్రామీ ణ ప్రజానీకం వ్యవసాయానికి పునరుజ్జీవనంతో కలళకళ లాడుతుంది. వలసల బాట తగ్గుతుంది. పల్లెలు వ్యవసా య శోభతో వర్థిల్లుతాయ. వ్యవసాయ రంగానికి 9 గం టల నీటి సరఫరాను అందజేయాలి. రైతుల ఆత్మహత్య లను నివారించే దివగా వారి ఆర్థిక వెసులుబాటుకు ప్రభు త్వం ఆచరణలో భరోసాగా నిలవాలి. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం దిశలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణంతో టిఆర్‌ఎస్ శ్రేణులు జేజేలు పలికిన రీతిలో ప్రభుత్వం పారదర్శకంగా పనులను పూర్తి చేయాలి. వ్యవసాయ రుణాల మాఫీపై చిత్తశుద్ధితో వ్యవహరించాలి.
21 నెలల తెలంగాణ ప్రభుత్వం పాలనలో గాడిలో పడుతున్నది. ఆహా ఓహోలకు ప్రాధాన్యత నివ్వకుండా లక్ష్యాలు పూర్తయ్యే చర్యలను వేగవంతంగా తీసుకోవాలి. నిజంగా విత్తన భాండాగారంగా రాష్ట్రం అభివృద్ధి లక్ష్యాలు సాగాలి. ప్రపంచీకరణ బూచి తొంగిచూస్తున్న తరుణం లో వ్యవసాయ సంస్కరణల్లో అంతర్లీనంగా మార్కెట్ శక్తుల ప్రయోజనాలు దాగివుండే అనివార్యత లేకపోలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం ఉండగలిగితే సంతోషించాల్సింది రాష్ట్ర ప్రజలు మాత్రమే.
వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమ లక్ష్యంగా పోరాట పంథాను రూపొందించుకొని ప్రభు త్వంపై ఒత్తిడి పెంచి ప్రజా సంక్షేమం కోసం తమ వంతు పాటుపడాలి. కేవలం రాజకీయాలే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరించవద్దు. వివిధ సందర్భాల్లో ప్రజాతీర్పును పాలకులు క్రాస్ చెక్ చేసుకుంటూ మరింత ఆత్మవిశ్వాసం తో మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడి ఒంటరిగా పోరు సల్పడం సాహసమే. ప్రజలవాణిని ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో వినిపించాలి. పాలనాధికారాలు చేజిక్కిం చుకున్న అధికార పార్టీ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అన్నీ అధినేతే చూసుకుంటాడులే అనే ఉదాసీనతను వీడి క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రజల ఆర్థిక స్వావలం బనతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నది అందరూ గుర్తించాలి.
- తంగెళ్లపల్లి కనకాచారి, హైదరాబాద్
విద్యాధికార్లను నియమించాలి
మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా మండలాలకు విద్యాధికారులు లేరు. చాలావరకు ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యావ్యవస్థ అంతా గాడితప్పుతున్నది. చాలాచోట్ల ఖాళీగావున్న ఎం.ఇ.ఓ. పోస్టును సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇస్తున్నారు. దీంతో వారి ఉద్యోగం రెండు పడవలపై ప్రయాణం అనే విధంగా మారింది. అలాంటిది వారికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే దానికి న్యాయం జరుగుతుందా? బాధ్యత భారం ఎక్కువై, పర్యవేక్షణ తగ్గుతుంది. ప్రతి మండలానికి రెగ్యులర్‌గా మండల విద్యాధికారి వుండే విధంగా చర్యలు తీసుకోవాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
ఉపాధి పొందితే ఉద్యోగాలెందుకు?
ప్రభుత్వంనుంచి సబ్సిడీ రుణాలను పొందుతున్న అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకట్టవేయాలి. వ్యాపారం, ఉపాధికోసం ఋణాలు మంజూరుచేస్తారు. అటువంటప్పుడు అభ్యర్థికి ఉపాధి లభించినట్లే. ప్రభుత్వ డబ్బుతో ఉపాధి పొందిన అభ్యర్థికి, ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు? తక్షణమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలి. ఋణాలు తీసుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అని వెంటనే జి.ఓ. ఇవ్వాలి.
- గరిల్ల రాధిక, తొండపాడు
బడా బకాయిదార్ల పేర్లు ప్రకటించాలి
జాతీయ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు కొన్ని వేల కోట్ల లోనున్నట్లు భోగట్టా. దీనికి అన్ని రాజకీయ పక్షాలలోను బడా నాయకులు అప్పులు తీసుకొని సకాలంలో చెల్లించడం లేదని వార్తాకథనం. దీనివలన బ్యాంకులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కనుక అట్టి బడా బ్యాంకు బకాయిదారుల పేర్లను సామాన్యుడు తెలుసుకునేలా ప్రింటు మీడియాలను, కరపత్రాల ద్వారా ప్రకటించాలి.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు