ఉత్తరాయణం

ఉరిశిక్ష వేగంగా అమలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడం సము చితం. విచారణ చేపట్టిన 20 నెలలలోపే శిక్షలు ఖరారు చేయడం ద్వారా నిందితునికి సరైన శిక్ష పడటంతో పాటు దేశంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఇనుమడిం చింది. తొలుత ముంబయ పోలీసులు సకాలంలో స్పం దించకపోయనా, మహారాష్ట్ర హోం మంత్రి జోక్యంతో విచారణ వేగవంతమైంది. పోలీసులు సైతం పగడ్బందీగా ఆధారాలు సేకరించడం శుభ పరిణామం. మరణశిక్ష కూడా అప్పీల్ అంటూ తాత్సారం చేయ్యకుండా శీఘ్రమే అమలు జరిగితే ఇటువంటి నీచమైన నేరాలకు ఒడిగట్టేకలియుగ కీచకులకు హెచ్చరికగా ఉంటుంది. ఆడపిల్లల పట్ల పశుప్రాయంగా ప్రవర్తించే వారిని యావత్ సమాజం వెలివేయడంతో పాటు వారి తరుపున వాదిం చేందుకు ఏ లాయరు ముందుకు రాకూడదు. ఇటువంటి అత్యాచారాలు జరిగే సంఘటనలో పోలీసులు న్యాయ స్థానాలు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా నిష్పక్ష పాతంగా, వేగవంతంగా, ప్రవర్తించాలి. దేశంలో ఇంకా అనేక అత్యాచారాల కేసులు ఏళ్ల తరబడి కోర్టులో మగ్గు తున్నాయ. బాధితుల కుటుంబాలు నిరాశా నిస్పృహలలో వుండగా నిందితులు మాత్రం బెయల్‌పై వచ్చి హాయగా జల్సా చేస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం తక్షణం ఫాస్‌ట్రటాక్ కోర్టు ద్వారా ఈ కేసుల విచారణ సత్వరం ముగించి నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. చదువులు, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఆడపిల్లలు క్షేమంగా, ధైర్యంగా ఉండగలిగే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే.
- సి. సాయ మనస్విత, విజయవాడ

మూల్యం చెల్లించుకున్న భాజపా
ఇటీవల వెలువడిన బిహార్ ఎన్నికల ఫలితాలు భాజపాతో పాటు సర్వతోముఖ హిందూజాగరణకై పరితపించే హిందూ సంస్థలకు కూడా తీవ్ర నిరాశ, నిస్పృ హలు కలిగించాయ. అయతే వీటిని మరో వాస్తవిక కోణంలోంచి చూస్తే ఈ నిరాశ, నిస్పృహలు అర్థంలేనివని, కొద్దిపాటి జాగ్రత్తలు గమనించి అడుగులేస్తే లక్ష్యసిద్ధికి మార్గాలు మిగిలే ఉన్నాయని అర్థమవుతుంది. అల్ప సంఖ్యాక వర్గాల వారు కేవలం మతకోణంలోంచి చూసి ఓటు వేయదలచుకున్నప్పుడు, భాజపా, శివసేన వంటి పార్టీలను మినహాయంచి మరే ఇతర పార్టీని వారు శత్రువుగా భావించరు. భాజపా పాలనలో మైనారిటీలు పొందినంత నిజమైన భద్రత, ఎదుగుదల మరే ఇతర సూడో సెక్యులర్ పార్టీల పాలనలోనూ జరగలేదన్న వాస్తవాన్ని వీరు గ్రహించరు. ఎవరినీ గ్రహించనీయరు. గ్రహించినా ఆత్మవంచనకే మొగ్గు చూపుతారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోను కేంద్రంలోను అధికారంలోకి రావా లంటే హిందువుల ఓట్లతో పాటు మైనారిటీల ఓట్లు కూడా కీలకమని గుర్తించని భాజపా కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులు కూడా చేసింది. రెండింటికి మూల్యం చెల్లించు కుంది. అద్వానీ గతంలో పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ జిన్నా సమాధికి మొక్కడమే కాక, జిన్నాకు గొప్ప కితాబు నివ్వడం, అలాగే కొద్ది నెలల క్రితం భారత్ పట్ల, భారతీల పట్ల అణువణువునా ద్వేషం నింపుకున్న ఒక పాకిస్తాన్ మాజీ మంత్రిని భారత్‌కు ఆహ్వానించి ఒక పుస్తకావి ష్కరణ సభకు అగ్ర తాంబూలం ఇవ్వడం వంటి చర్యల వల్ల ముస్లిం ఓట్లు పడకపోగా, హిందూ ఓటు బ్యాంకును భాజపా కొంతమేర కోల్పోయంది. ముస్లిం ఓట్ల కోసం ఇవే తప్పులు మరే ఇతర పార్టీ అయనా చేసి ఉన్నట్లయతే కొద్దోగొప్పో వారికి ఓట్లు పెరిగేవి. అధికారం దక్కాలంటే హిందువుల ఓట్లు ప్రముఖమైనవే అయనా, హిందువు లను గడ్డిపోచకింద చూసే పార్టీలు మైనారిటీ ఓట్లకై తపించడానికి ప్రధాన కారణం వారివి సాధారణంగా ఏకరాశి ఓట్లు కావడం. 2009లో దేశ వ్యాప్తంగా పార్లమెం టుకు జరిగిన ఎన్నికల్లోనూ, 2015లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ, భాజపా ఓడిపోయనా, ఆ పార్టీకి పడిన ఓట్లన్నీ కేవలం మత కోణంలోంచి చూసి వేసిన ఓట్లుగానే భావించే పరిస్థితులున్నాయ.
- పి.వి. నరసింహారావు, రాజమండ్రి

దుర్వినియోగమవుతున్న చట్టాలు
గృహహింస చట్టం దారుణంగా దుర్వినియోగమ వుతోంది. దీనికి సంబంధించి ఇటీవల భూమికలో వచ్చిన వ్యాసంలో రచయత చాలా కూలంకషంగా చర్చించారు. నిజానికి ఈ చట్టం దుర్వినియోగం అవడాన్ని సుప్రీంకోర్టు కూడా గమనించి కొన్ని నిబంధనలు సవరించింది. ఇంతకు ముందు కేసు పడగానే అత్తింటి వారిని వెంటనే అరెస్ట్ చేసేవారు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారి విచారణ జరిపి ఆరోపణలో బలం ఉంటేనే అరెస్ట్ చేయాలి. ఈ చట్టమే కాక, అట్రాసిటీ చట్టం కూడా దుర్వినియోగం అవుతోంది. అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి కులం పేరుతో దూషించాడంటూ కేసు పెట్టేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పిల్ కూడా దుర్వినియోగం అవడం అందుకు జరిమానా విధించడం జరుగుతూనే ఉంది. ప్రజలు లిటిగేషన్ మనస్తత్వాన్ని తగ్గించుకోవాలి.
- శాండీ, కాకినాడ

కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి
పాక్ టీవీ ఇంటర్వూలో మణిశంకర్ అయ్యర్ ‘ప్రధానిగా మోదీని తొలగిస్తేగాని ఇండో పాక్ చర్చలు ప్రారంభం కావు’ అన్నాడు. మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇంచుమించి ఇలాగే చెప్పాడు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. తమకు సంబంధం లేదంటూ కాంగ్రెస్ చేతులు దులుపుకుంది. ఈ మధ్యనే సుబ్ర హ్మణ్యస్వామి, రాహుల్ తాను బ్రిటిష్ పౌరుడనని, ఆ దేశ లా అధికారులతో చెప్పినట్లు ప్రకటించగా, భాజపా తన తొత్తులతో ప్రకటన చేయంచేకంటే నేరుగా ప్రకటిం చవచ్చుగా అన్నాడు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి ఇది ఉదాహరణ.
- సుభాష్, శ్రీనగర్, తూ.గో. జిల్లా