ఉత్తరాయణం

‘సినిమా’ డైలాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విమానాల్లో మోదీ. పంట పొలాల్లో నేను. వారిది సూటు బూటు ప్రభుత్వం. రైతులు, పేదల పక్షాన మేము. ఈ పోరులో చావుకయినా సిద్ధమే’‘ ఎవరు రాసి పెట్టారో గాని రాహుల్ మాటలు సినిమా పంచ్ డైలాగుల్లా ఉన్నాయి! మోదీ సరదా షికార్లకోసం విదేశాలకు వెళ్లడం లేదు. వాటివల్ల మన దేశానికి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలుగుతున్నాయి. 1947లో అధికార మార్పిడి జరిగి బ్రిటిష్ విధానాలే కాంగ్రెస్ కొనసాగించింది. అందువల్ల అదే సూటుబూటు ప్రభుత్వం. ఇప్పుడు మనది అని చెప్పుకోదగ్గ ప్రభుత్వం ఉంది. చేయడానికి మరేపనీ లేక రాహుల్ పొలాలకు వెళ్లాడు. రెండుసార్లు దేశాన్ని వదిలి రహస్యంగా గడిపి వచ్చాడు. పార్లమెంటుకు సరిగా వెళ్లడు. అక్కడ చర్చల్లో పాల్గొనడు. కాంగ్రెస్ హయాంలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి కాంగ్రెస్ రైతులకు, పేదలకు చేసిందేముంది?
- శాండో ప్రచండ్, శ్రీనగర్

ఇంటర్వ్యూలు రద్దు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 స్థాయి ఉద్యోగాల నుండి కింది స్థాయి ఉద్యోగాల వరకు, ఇంటర్వ్యూలను రద్దుచేయాలి. కేంద్ర ఆదేశానుసారం, ఇంటర్వ్యూ రద్దు గురించి ఎ.పి. ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. నిరుద్యోగులు దళారులను నమ్మి, డబ్బులు వృధా చేసుకోకుండా ఇంటర్వ్యూలు రద్దుచేయమని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే సమయం ఆసన్నమయింది.
- చల్లేటి రామకృష్ణ, అనంతపురం

‘అసహన’ భూతం
‘అసహనం’ అనే భూతాన్ని కాంగ్రెసు, కమ్యూనిస్టు, ఇతర విదేశీ పార్టీలు దేశాన్ని అస్థిరం చేయడానికి కుట్ర చేస్తున్నాయి. హిందువులు నిద్రావస్థలో వున్నారు. హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. భారతదేశంలో పుట్టి పెరిగి గాలి నీరు పీల్చి విదేశీవాడు భారతదేశంపై కుట్ర జరిపితే దానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి కుహనా మేధావులు, కళాకారులు, తాము కొనుక్కున్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారంటే, అమ్ముడుపోయినావారు అనడానికి సందే హం లేదు. అమీర్‌ఖాన్, షారూఖ్‌ఖాన్‌లా సినిమాలు హిందువులే ఎక్కువమంది చూస్తారు. వాళ్ళవల్లనే వీళ్ళకు అవార్డులు, రివార్డులు వచ్చాయి గాని కేవలం ముస్లింల వల్ల కాదు. భారతదేశంలో పుట్టినందుకు, వున్నందుకు గర్వించాలి. అదే పాకిస్తాన్ పుట్టి ఉంటే ఏదో బాంబుకు బలయిపోయేవారు. ఇది గమనించాలి. అవార్డులు భారతదేశం ఇచ్చింది. భా.జ.పా. ఇవ్వలేదు. దేశాన్ని అవమానించే వాళ్ళు. ఈ దేశంలో ఎలా వుంటారు.
- గుడ్ల జగదీశ్వర్, హైదరాబాద్

తమిళుల ప్రత్యేకతే వేరు
మద్రాసు హైకోర్టు వ్యవహారాలు విచిత్రంగా ఉంటున్నాయి. బెయిల్ దొరకక శృంగేరి పీఠాధిపతి నానా అగచాట్లు పడి నాకిక్కడ న్యాయం జరగదని సుప్రీంకోర్టుకు విన్నవించి తన కేసును పుదుచ్చేరి కోర్టుకు మార్పించుకున్నారు. అక్కడ బెయిల్ లభించడమేకాక నిర్దోషిగా బయటపడ్డారు. న్యాయవాదుల సమ్మె చట్టవిరుద్ధం అని హైకో ర్టు తీర్పు చెప్పినా అక్కడి న్యాయవాదులు రాజకీయ ప్రేరిత సమ్మెలు చేస్తూ విధ్వంసం సృష్టిస్తారు. క్రమశిక్షణా రాహిత్యానికి ఈమధ్యనే 20మంది న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ బహిష్కరించింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. అసహనం పెరుగుతోంది. గోవధ నిషేధాన్ని రాజ్యాంగ అధికరణం నుంచి తొలగంచాలి. ఇవి రాజకీయ నాయకుల మాటలు కాదు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి మాటలు!
- ప్రసాద్, గొడారిగుంట

చిన్నారులకు భద్రత ఏది?
అభం శుభం ఎరుగని చిన్నారులకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నా యి. దీని పర్యవసానంగా చిన్నారుల ప్రాణాలు నీట్లో కలిసిపోతున్నాయి. చదువుకోసం ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. రాజక్యీ నాయకులు తమ ప్రసంగాల్లో నేటి బాలలే రేపటి పౌరులంటారు. ఆచరణలో మాత్రం శూ న్యం. ఒక ప్రక్క పౌష్టికాహారం లోపంవలన, గ్రామీణ, ఏజెన్సీ, మురికివాడల్లో ఆరోగ్యం లేక, ఇంకొక ప్రక్క చదువుల్లో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు వెరసి దేశంలో లక్షలాది చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చిన్నారులకు అన్నివిధాల భద్రత కల్పించాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
- మిస్సుల గాయత్రీదేవి శివరామకృష్ణ, హైదరాబాద్

భిన్నత్వంలో ఏకత్వం
అతి పురాతన సంస్కృతి, సంప్రదాయాలుగల భారతదేశం మనది. ఈ పుణ్య భరతభూమిలో విభిన్న కులాలు, మతాలు, జాతులు, భాషలు కలిగి వున్నాయి. అయినా భిన్నత్వంలో ఏకత్వ విధానమే సంప్రదాయంగా భావించుకొని ఐకమత్యంతో సహజీవనం చేస్తూ సోదర సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి మన దేశంలో నేడు మతం, ప్రాంతం, భాషా, జాతుల పేరున ప్రజలందరినీ విభజించి పరిపాలించాలని స్వార్థపర రాజకీయవాదులు కుట్ర పూరితమైన పన్నాగాలు పన్నుతున్నారు. భిన్నత్వంలోని ఏకత్వ విధానమే ప్రధాన ధ్యేయంగా అనుసరిస్తున్న కాంగ్రెస్(ఐ)పార్టీ దేశ ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయం గా భావించుకొని, దేశ సమైక్యత, సమగ్రతలకోసం పాటుపడుతూ వస్తున్నది. విష పూరితమైన విధానాలను ఎండగట్టి భారతీయులంతా ఒకటేనని, జాతి ప్రజలంతా ఏకత్రాటిపై నిలిచి స్వార్థపర దుష్టశక్తులు విసిరే ఎంతటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు కలిగి వున్నామని ప్రపంచానికి మరో మారు చాటుకోవాలి.
- రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్