ఉత్తరాయణం

సేవలు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా రోమింగ్ ఉచితం, రాత్రిళ్లు ఔట్ గోయింగ్ ఉచితం అంటూ ప్రచారం చేసుకుంటున్న బి.యస్.యన్.యల్. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో విఫలవౌతోంది. శ్రీకాకుళం నగరంలో వర్షం పడితే చాలు ల్యాండ్‌లైన్ ఫోన్లు మూగపోతాయి. నగరంలోని సెల్ టవర్లకు తరచుగా విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా సెల్ సిగ్నల్స్ నిలిచిపోతుంటాయి. మామూలు సమయాల్లో లైన్లు అర్ధాంతరంగా కట్ అయిపోతూ వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇక బ్రాడ్‌బ్యాండ్ సేవలు చాలా అధ్వాన్నంగా వుంటున్నాయి. ఇంటర్నెట్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో, ఎప్పుడు నిలిచిపోతుందో భగవంతునికే ఎరుక. బి.యస్.యన్.ఎల్. సేవలలో నాణ్యత లేని కారణంగా ప్రజలు ఇతర టెలికం సంస్థలకు మారిపోతున్నారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

చరిత్రను మరువకూడదు
తెలుగు రాష్ట్రం అధికారికంగా విడిపోయిన జూన్-2వ తేదీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వారి రాష్ట్రావతరణ దినోత్సవాలుగా రజుపుకోవడం సమ్మతమైనా ఇరవైమూడు జిల్లాలతో ఏర్పడిన నవంబర్ ఒకటవ తేదీ ఆంధ్ర రాష్ట్రావతరణను ఇరు రాష్ట్రాలు విస్మరించడం చరిత్రకు చేసిన అపరాధం. కనీసం ఇదే పేరుతో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఆరోజున సభలు జరిపి స్మరించుకోకపోవడం దురదృష్టం. ఈ కంప్యూటర్ యుగంలో చరిత్రను పాఠ్యాంశంగా ఎవరూ చదవడం లేదు. కనీసం సభలు, సమావేశాలు ప్రభుత్వపరంగా, విద్యాసంస్థల్లో జరిపి ఉన్నట్టయితే భావితరాల వారికి ఈ తేదీ ప్రాముఖ్యత తెలిసేదిగా. రానున్న కాలంలో ఈ పొరబాటురానీయొద్దని మనవి.
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్

తెల్లోడి బుర్రే బుర్ర!
మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చినా తమ తరహా పాలనే కొనసాగాలని, హిందువులకు హిందువుల్నే శత్రువులు చేయాలని ఆంగ్ల సంస్కృతి, భాష ప్రవేశపెట్టి విజయం సాధించాడు తెల్లోడు. అందుకే కానె్వంట్ చదువుల బాబులకు ప్రభుత్వ బడిలో చదివి, ఎర్రబస్సులో ప్రయాణించే బీదాబిక్కీ అంటే చిన్నచూపు, అసహ్యం. వాళ్లుత్తి మూర్ఖులు. మూఢ నమ్మకాలోళ్లు అనుకొని వారిపై నోరుపారేసుకుంటారు. అవమానిస్తారు. ఇప్పుడు పతకాలు తిరిగి ఇచ్చేస్తున్న వాళ్లు ఈ ఇంగ్లీషు చదువుల బాబులే. ‘మోదీ డూన్ స్కూలులో చదివి విదేశీయాసతో ఇంగ్లీషు మాట్లాడే వాడయితే ఈ సాహితీపరులు పతకాలు తిరిగి ఇచ్చేవారు కాదు. మునుపటి లాగానే కిమ్మనకుండా ఊరుకునేవారు’ అని ప్రఖ్యాత రచయిత చేతన్‌భగత్ అన్నది సమంజసమే కదా!
- సుధీర్, శ్రీనగర్

ఒట్టి అమాయకులు
ఎ.పి. రాష్ట్ర నిరుద్యోగి ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు. 1 1/2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నా, సిఎంను అడగకుండా వౌనంగా ఉన్నాడు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎ.పి. రాష్ట్ర నిరుద్యోగి అమాయకత్వాన్ని చూసి, ప్రభుత్వం సంతోష పడుతోంది. ప్రజాప్రతినిధుల రాజీనామాలను నిరుద్యోగి కోరాలి. నోటిఫికేషన్లు వెంటనే ఇస్తామని హామీ ఇచ్చి, నిరుద్యోగి నుంచి ఓటును తీసుకుంది ప్రభుత్వం. మరి అటువంటప్పుడు, నిరుద్యోగి అమాయకంగా ఉంటే ఎలా? నిరుద్యోగి, నిరుద్యోగి కలిసి ఈ విషయాన్ని చర్చించాలి. చర్చించి ప్రభుత్వానికి నివేదించాలి.
- గొల్ల మంజుల, చెట్నేపల్లి

నిఘా వ్యవస్థ ఉండాలి
పరిశ్రమలు నెలకొల్పుతారన్న ఆశతో చైనా, జపాన్ వంటి విదేశీ సంస్థలకు వేలాది ఎకరాల భూమి కేటాయించటంలో ఒక అతి ప్రమాదకరమైన కోణాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. ఆ భూమిలో పరిశ్రమలతోపాటు మిస్సైల్స్ వంటివి తయారుచేసి, మన దేశ భద్రతనే సవాల్ చేసే అవకాశం పొంచి ఉంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆనాటి రాజులు కోటలు కట్టుకోవటానికి అనుమతించిన తర్వాతే ఫ్రెంచి, బ్రిటీష్ వర్తకులు మన భూభాగాలపై సార్వభౌమాధికారం సంపాదించి, దానిని పదిల పరచుకొన్నారు. వారిని పెకలించటానికి రెండు దశాబ్దాల పోరాటం అవసరమైంది. ఆనాటి అనుమతులకీ- నేటి 99 సంవత్సరాల లీజుకీ పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే లీజు కాలపరిమితిని 20 సంవత్సరాలకు తగ్గించి, ప్రతి 5 సంవత్సరాలకూ సమీక్ష చేసి- ఒప్పకున్న అవసరాలకు కాకుండా వేరే రకంగా ఉపయోగిస్తే.. లీజు రద్దుచేసే అధికారం మన ప్రభుత్వం ఉంచుకోవాలి. విదేశీయుల పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసే స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవలసిన అవసరం ఉంది.
- బొల్లాప్రగడ వెంకట పద్మరాజు, విజయవాడ

అసలు చరిత్ర తెలియదు
ఇందిర, రాజీవ్ తపాలా బిళ్లలు తొలగించిన బిజెపి త్యాగధనుల్ని గుర్తించడం లేదని గగ్గోలుపెట్టే వారికి అసలు చరిత్ర తెలియదు. వందలాది త్యాగధనుల్ని పక్కకి నెట్టేసి త్యాగధనులంతా ఒకే కుటుంబంలో పోగుపడి ఉన్నట్టు చరిత్రను వక్రీకరించినది కాంగ్రెస్సే. అందుకే ఓటు పోటుతో ప్రజలు ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఐదారు చిన్న రాష్ట్రాల్లో తప్ప పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం పోయింది. ఇప్పటికీ 80 శాతం ప్రభుత్వ పథకాలు, రోడ్లు, విమానాశ్రయాలూ అవార్డులూ ఇందిర, రాజీవ్ పేర్ల మీదనే ఉన్నాయి. బిజెపి విపరీత పోకడలు పోతే ప్రజలు దానికీ బుద్ధిచెప్తారు.
- సోనాలి, సూర్యారావుపేట