ఉత్తరాయణం

స్వదేశీయతను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్ముడే నా స్ఫూర్తిదాత అని చెప్పుకొనే ప్రధాని మోదీ చైనా నుండి విపరీతంగా దిగుమతి ఔతున్న వస్తువులను నిషేధించాలి. విదేశీయుల పెట్టుబడులను ఆహ్వానించకూడదు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ పారిశ్రామికులను, శాస్తజ్ఞ్రులను, ఇంజనీర్లను ప్రోత్సహించాలి, అన్ని విధాల సహకరించాలి.
- సత్యప్రకాశ్, సూర్యాపేట

స్ర్తిలను అవమానించవద్దు
రుతుస్రావం సమయంలో మహిళలు దేవాలయాల్లోను, ఇతర పుణ్యక్షేత్రాల్లోను ప్రవేశించకూడదన్న విషయంపై ఇటీవల పెద్ద దుమారం రేగింది. ముఖ్యంగా ఆలయ అధికారి ఒకరు స్కానింగ్ ద్వారా స్ర్తిలను పరీక్షించిన తర్వాత మాత్రమే ఆలయాల్లోకి ప్రవేశించాలని వ్యాఖ్యానించడం మహిళలను తీవ్రంగా అవమానించడమే. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. రుతుస్రావం కలిగిన నిర్ణీత రోజుల్లో స్ర్తిలు దేవాలయాల్లోకి గాని, ప్రార్థనాలయాల్లోకి గాని, దర్గాలలోకి గాని ప్రవేశించడం నిషిద్ధమన్నది ఆనవాయితీగా వస్తున్నదే. అసలు విషయమేంటంటే రుతుస్రావ దినాల్లో మహిళలు దేవాలయాల వంటి పవిత్ర స్థలాలకే కాదు, ఇంట్లోని పూజ గదిలోకి సైతం వెళ్లరు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఇది అన్ని మతాల వారికి వర్తిస్తుంది. ఇది కచ్చితంగా వ్యక్తిగత విషయం. ఎవరికి వారు జాగ్రత్త పడి ఏ అపచారం జరగకుండా జాగ్రత్త పడుతుంటారు. దైవభీతి, పాపభీతి కలవారు అపరిశుద్ధ సమయాలలో పవిత్ర స్థలాల్లోకి ప్రవేశించడానికి సాహసించరు.
అంతే తప్ప ఆధునిక పోకడలకు పోయి అది స్ర్తిలకు ప్రకృతి సహజమని, స్ర్తి సహజమైన శరీర ప్రక్రియ అంటూ కొత్త ఒక వింత-పాత ఒక రోత అన్నట్లు వికృత వితండవాదం చేయడం సరికాదు. ఇంకా వెనకటి రోజుల్లో అయితే ఇంట్లోకి సైతం రాకుండా ఆ సమయంలో బయటే ఉండి, తలారా స్నానం చేసి గాని ఇంట్లోకి వచ్చేవారు కాదు. చాలా చోట్ల అన్ని మతాల పుణ్యక్షేత్రాల్లో కేవలం పురుషులకే ప్రవేశం ఉంటుంది. మహిళలు బయటనుంచే నమస్కరిస్తుంటారు. పూర్వకాలంలో పెద్దలు ఎంతో ఆలోచించే ఆ నిర్ణయాలు తీసుకొని ఉంటారు. మనం వాటిని తప్పుపట్టి కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ఇది స్ర్తిలను అణగదొక్కడం ఎంతమాత్రం కాదు. మన భారతదేశంలో స్ర్తిలను దేవతామూర్తులుగా పూజించడం లేదా? జరిగిన దాంట్లో తప్పొప్పులను గ్రహించి సామరస్యంగా నడుచుకోవడం సర్వదా శ్రేయస్కరం.
-పి. షహనాజ్, అనంతపురం

లింక్ ఎక్స్ ప్రెస్‌ను ఏర్పాటు చేయాలి
అతి త్వరలో విశాఖ- న్యూఢిల్లీల మధ్య రోజువారి ఎక్స్ ప్రెస్‌ను నడపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదించడం తెలుగువారందరికీ కచ్చితంగా ఒక శుభవార్త. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు దృష్టికి మరో అంశాన్ని తీసుకువస్తున్నాను. అదే ఎక్స్ ప్రెస్‌కు విజయవాడలో తగిలించేలా తిరుపతి-విజయ వాడల మధ్య ఒక లింక్ ఎక్స్‌ప్రెస్ నడపడం వల్ల ఇంచుమించు సీమాంధ్ర ప్రజలందరికీ దేశ రాజధానికి వెళ్లడం సుగమం కాగలదు. ఈ విషయం కూడా వెంక య్యనాయుడు సానుకూలంగా ఆలోచించి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చేత ఆమోదింప జేయాలని విజ్ఞప్తి.
- గురజాల విజయకుమార్, యాప్రాల్, సికింద్రాబాద్

ఏమిటీ విపరీత ధోరణులు?
రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి గోవులే దొరికాయా? వామపక్షాల వారు, హిందూ వ్యతిరేకుల క్రూర ప్రవర్తనకు అమాయక జంతుజాలం బలికావలసిం దేనా? విద్యాలయాలు చదువుకోవటానికే గాని, జంతు వులను, మనుషులను కోసుకొని తినడానికి కాదు కదా. ఏమిటీ విపరీత ధోరణులు? ప్రజాస్వామ్య సాంస్కృతిక ఫోరం కన్వీనర్ గోమాంసాన్ని తినమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొన్నట్టు తెలుపుతున్నారు. అంతేకాదు చికెన్‌లో 8.3 శాతం, గొర్రెల్లో 12శాతం, గోమాసంలో 28.3 శాతం ప్రోటీన్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. అదే మనిషి మాంసంలో 35.8 శాతం ప్రోటీన్లు ఉంటాయ. అంటే మనిషి మాంసం కూడా తినమంటారా? పవిత్రమైన జంతువును హింసించడం వల్ల వీరికి అంతటి ఆనందం కలుగుతుందా? పులులు, సింహాలు తినే తిండి మానవ శరీరానికి పట్టదని శాస్ర్తీయంగా నిరూపితమైంది. ఇప్పటికైనా అర్థం చేసు కొని మానవత్వంతో మనుగడ సాగించాలి.
- జి. శ్రీనివాసులు, అనంతపురం

ఎందుకింత రభస?
ఈసారి బీఫ్ ఫెస్టివల్‌పై ఫోకస్‌లో ఒక ముస్లిం చెప్పిన విషయాలు నిజాయతీతో కూడి ఉన్నాయ. మన వామపక్ష నేతలకు, ఆపాటి విజ్ఞత లేకపోవడం విచారకరం. కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు తప్ప రాజ్యాంగ సూచన మేరకు మిగిలిన చాలా రాష్ట్రాల్లో గోవధ నిషేధించారు. ఆ విషయం మేధావులకు తెలియదా? ఏమీ తెలియకుండానే రభస చేయడం మనవారి ప్రత్యేకత. హనుమాన్ చౌదరి గారి అభిప్రాయం సహేతుకంగా ఉంది.
- మైథిలి, సర్పవరం

గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వాలి
2009లో ప్రభుత్వం ద్వారా కమ్యూనిటీ పారా మెడిక్‌గా శిక్షణ పొందిన ఆర్‌ఎంపి గ్రామీణ వైద్యులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహించి పాసయన వారిని కమ్యూనిటీ పారామెడికల్ సిపిలుగా గుర్తింపు నివ్వాలి. ఆ తర్వాత రిజిస్టరు చేసుకుంటే మారుమూల గ్రామాల్లో ప్రాథమిక చికిత్సలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లకు సహాయకులుగా అవకాశాలు లభిస్తాయ. గత నలబయ ఏళ్లుగా ఇందుకోసం పోరాటం చేస్తున్నారు.
- ఎన్. జనార్ధన, జమ్మలమడుగు