శ్రీకాకుళం

విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 20: జిల్లాలోగల ప్రతీ గ్రంథాలయ కేంద్రాన్ని విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సౌకర్యాల మోజులో గ్రంథాలయ ప్రాముఖ్యతను పాఠకులు విస్మరిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రంథాలయాభివృద్ధికి డిజిటల్ విధానాన్ని అనుసంధానం చేయడానికి ప్రణాళిక చేస్తోందన్నారు. అయితే, సరైన సిబ్బంది లేక, పాఠకులకు వౌలిక సదుపాయాలు, భవనాలు తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అచ్చెన్న భరోసా ఇచ్చారు. ముందుగా 12.50 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ నిధులతో నిర్మించిన ఆడిటోరియంను మంత్రి అచ్చెన్న ప్రారంభించారు. ఈ ఆడిటోరియంకు అవసరమైన ఫ్లోరింగ్, ఎ.సి., కుర్చీలు తదితర అవసరమైన తుదిమెరుగులు ప్రభుత్వ నిధులతో పూర్తిచేస్తామన్నారు. దీనికి సంబంధించిన అంచాలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి అదనంగా మోడల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తిలు మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడం కష్టమని వాటిని అందించడంలో అదే విధంగా గ్రంథాలయాభివృద్ధికి అన్నివిధాల సహాయసహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అరసవల్లిలో గల గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని ఎమ్మెల్యే లక్ష్మీదేవి కోరారు. సభాధ్యక్షత వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్‌రావు మాట్లాడుతూ గ్రంథాలయాలు సామాజిక స్పృహ కలిగే దశలో అభివృద్ధిజరిగేలా పనిచేస్తానన్నారు. వారోత్సవాల్లో జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వక్తలు బహుమతులు అందజేశారు. సాహిత్యవేత్త పులఖండం శ్రీనువాసరావు వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమంలో ఆర్డివో బి.దయానిధి, డి.ఎస్పీ కె.్భర్గవనాయుడు, జామి భీమశంకర్, జిల్లా దేశం యువత అధ్యక్షుడు కొర్ను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.