Others
అబ్బో.. 3.2 మిలియన్ల ‘లైకులు’!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సామాజిక వెబ్‌సైట్లలో అనునిత్యం ఏదో ఒక సంచలనమే! ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు, పదునైన వ్యాఖ్యలను ‘అప్‌లోడ్’ చేయడం ఓ వేలం వెర్రిగా మారుతుండగా- వాటికి ‘లైక్’లు కొట్టడం మరో బిజీ వ్యాపకం! ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో ప్రస్తుతం ఓ ఫొటో సంచలనం రేపుతోంది. హృదయాకారంలో జుట్టును విరబోసుకుని ప్రఖ్యాత మోడల్, టీవీ నటి కెండాల్ జెనె్నర్ (20) పోజు ఇచ్చిన ఫొటోకు రికార్డు స్థాయిలో 3.2 మిలియన్ల ‘లైకులు’ లభించగా, ‘్ఫలోయర్స్’ సంఖ్య 42.5 మిలియన్లు దాటింది. 2015లో అత్యంత ఆదరణ పొందిన ఫొటో ఇదేనని ‘ఇన్‌స్టాగ్రామ్’ తాజాగా ప్రకటించింది. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌కు చెందిన కెండాల్ నికోల్ జెనె్నర్ మోడలింగ్‌లోనూ, టీవీ రియాల్టీ షోల్లోనూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. హృదయాకారంలో జుట్టు విరబోసుకున్న ఆమె ఫొటోను ఈ ఏడాది మే నెలలో ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఉంచగా, నెటిజన్ల నుంచి అనూహ్యరీతిలో ‘లైకులు’ వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక సంఖ్యలో ‘లైకులు’ లభించిన ఫొటోలకు సంబంధించి గాయని టేలర్ స్విఫ్ట్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికన్ టీవీ చానళ్లలో సంచలన తార, మోడల్ కిమ్ కర్దాషియాన్‌కు ‘టాప్ టెన్ ఫొటోల’ జాబితాలో స్థానం లభించక పోవడం గమనార్హం.