బిజినెస్

నూతన లిస్టింగ్ నిబంధనలు ప్రకటించిన సెబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 30: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించే సంస్థల కోసం సోమవారం కొత్త లిస్టింగ్ నిబంధనలను తీసుకొచ్చింది. పలు కీలక నిర్ణయాల్లో భాగంగా దీన్ని తీసుకురాగా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)తోపాటు ఇతర అన్ని లిస్టింగ్ నిబంధనలను మార్చి కొత్తగా పరిచయం చేసింది. నూతన నిబంధనల ప్రకారం మంగళవారం నుంచి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సహా అన్ని దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉన్న సంస్థలు తప్పనిసరిగా సమయానుసారం అన్ని విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. లేనిపక్షంలో జరిమానాలు, ట్రేడింగ్ నుంచి బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు మైనారిటీ మదుపరుల రక్షణార్థం ఐపిఒలు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ)ల ద్వారా మదుపరుల నుంచి నిధులను సమీకరించిన సంస్థలు తమ వ్యాపార ప్రణాళికలో చేసే మార్పులు మదుపరులకు నచ్చనిపక్షంలో ఆ సంస్థల నుంచి వారు తప్పుకునే అవకాశాన్ని కూడా సెబీ తాజాగా కల్పించింది. అలాగే బిజినెస్ రెస్పాన్సిబిలిటి రిపోర్టులు టాప్-500 కంపెనీలకు కచ్ఛితంగా అవసరమని కూడా సెబీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇదిలావుంటే డిమ్డ్ పబ్లిక్ ఆఫర్ల కోసం పీనల్ ప్రొవిజన్‌ను సెబీ తప్పించింది. అంతేగాకుండా చిన్న సంస్థల కోసం డీలిస్టింగ్ నిబంధనలనూ సడలించింది. గ్రీన్ బాండ్ల కోసం కూడా కొత్త నిబంధనలను సెబీ సోమవారం ప్రతిపాదించింది.