రాష్ట్రీయం

సర్కారు బడుల్లో ఎల్‌కెజి ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి నియోజకవర్గంలో మహిళా పిఎస్
వౌలిక సదుపాయాలపై దృష్టి
సీమ అభివృద్ధిపై సమీక్షించండి
మండలిలో ఎమ్మెల్సీల డిమాండ్లు
కొనసాగుతున్న బడ్జెట్ చర్చ

హైదరాబాద్, మార్చి 17 : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి లోనే ఎల్‌కెజి, యుకెజి తరగతులను ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయని శాసనమండలిలో పిఆర్‌టియు సభ్యుడు గాదె శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. 2016-17 వార్షిక బడ్జెట్‌పై మండలిలో గురువారం కొనసాగిన చర్చలో పాల్గొంటూ, పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉంటున్నాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కెజి, యుకెజి తరగతులు ఉండటంతో తల్లిదండ్రులు తమపిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీప్రైమరీ టీచర్లను నియమించుకుని, ఎల్‌కెజి, యుకెజి తరగతులను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ఎందుకు చదువు మానివేస్తున్నారో అధ్యయనం చేయాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని శ్రీనివాసులు కోరారు. ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని టిడిపి సభ్యురాలు సంధ్యారాణి కోరారు. ప్రైవేట్ రంగంలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కల్పించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్ణణ ప్రాంతాల్లో నియత విద్య, గృహనిర్మాణం, మంచినీరు, మరుగుదొడ్లు తదితర వౌలిక వసతులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని ఎంవివిఎస్ మూర్తి కోరారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేపలు, ఆక్వా పెంపకం కోసం ఎపిలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని, వీటి ఉత్పత్తి పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచించారు.
రాయలసీమలో కొత్తగా పరిశ్రమలు రావడం లేదని, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సంస్థల ఏర్పాటు జరగడం లేదని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉపనాయకుడు డాక్టర్ గేయానంద్ గుర్తు చేశారు. సీమలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అవసరం అయితే ఉపప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు, కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టిడిపి సభ్యురాలు శమంతకమణి కోరారు. పురుషులు నడిపే పరిశ్రమల్లో చాలా వరకు ఐపి పెట్టి మూసివేస్తున్నారని, అయితే మహిళాఎంటర్‌ప్యూనర్స్ విజయవంతంగా పరిశ్రమలను నడిపిస్తున్నారని గుర్తు చేశారు. మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వీరిని ప్రోత్సహించడం వల్ల జిఎస్‌డిపి పెరిగుతుందని, తద్వారా సమాజానికి కూడా ఉపయోగమన్నారు.