బిజినెస్

కాకినాడ పోర్టులో ఎల్‌ఎన్‌జి టెర్మినల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 22: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టులో ప్రభుత్వానికి దీటుగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) టెర్మినల్ నిర్మాణానికై యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. కృష్ణా-గోదావరి ఎల్‌ఎన్‌జి టెర్మినల్ పేరుతో ఈ ప్రాజెక్టు కాకినాడకు మంజూరయ్యింది. కాకినాడ, విశాఖ నగరాల్లో ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు 4 వేల కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలోను, 2,500 కోట్ల రూపాయల వ్యయంతో కాకినాడలోను అత్యాధునిక ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో ప్రైవేట్ రంగంలో కాకినాడలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్ నిర్మాణానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ టెర్మినల్‌ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తుండటం విశేషం. సుమారు 1,200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ తీర ప్రాంతానికి మహర్దశ పట్టనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాకినాడ పోర్టుకు 17 కిలోమీటర్ల దూరాన సముద్రంలో రెండు ఓడల మధ్య ఓ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటుచేసి ద్రవ రూప సహజవాయువును 161 సెంటీగ్రేడ్ వద్ద సహజవాయువుగా మార్చే ప్రక్రియ ఈ టెర్మినల్‌లో జరుగుతుంది. ఇక్కడి నుండి సముద్రాంతర్గత పైపులైన్ల ద్వారా ఆన్‌షోర్ రిసీవింగ్ ఫెసిలిటీ కేంద్రానికి గ్యాస్‌ను సరఫరా చేస్తారు. అక్కడి నుండి వివిధ పరిశ్రమలకు, ఇతర అవసరాలకు గ్యాస్ సరఫరా జరుగుతుంది. స్థానికంగా ఈ టెర్మినల్‌ను ఏర్పాటుచేయడం ద్వారా గ్యాస్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుందని, అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాజెక్టు నిర్వాహకుడు డాక్టర్ కామేశం ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. కృష్ణా-గోదావరి బేసిన్‌లో పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వలు ఉన్నందున, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలకు ఇక్కడి నుండి సహజవాయువును సరఫరా చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నా రు. రాష్ట్రంలో విద్యుదుత్పాదన శక్తి మెరుగవుతుందని, ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి మానవ తప్పిదాలకు అవకాశం ఉండదని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం జరుపుకుంటుందని వివరించారు. రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఈ ప్రాజెక్టు అనుకూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఎల్‌ఎన్‌జి టెర్మినల్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్థానిక నినాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయా వర్గాల ప్రజలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుపై కాకినాడ పోర్టులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 17 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను రికార్డ్ చేసి, మినిట్స్ రూపంలో కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖకు పంపామని, కేంద్రం నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడగానే ప్రాజెక్ట్ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు.