రాష్ట్రీయం

అవధాన బ్రహ్మ గరికపాటికి లోక్‌నాయక్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

23న విశాఖలో ప్రదానం చలసాని గాంధీకి జీవిత సాఫల్య పురస్కారం
విశాఖపట్నం, నవంబర్ 24: అవధాన బ్రహ్మ గరికపాటి నరసింహరావుకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం లభించింది. లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుల కమిటీ ప్రతినిధులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, నారాయణ రెడ్డి, రఘురామ్ విస్తృత పరిశీలన అనంతరం గరికపాటిని ఎంపిక చేసినట్టు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం, బోడపాడు అగ్రహారంలో 1958 సెప్టెంబర్ 14న జన్మించిన గరికపాటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసిన గరికపాటి 275 అష్టావధానాలు, ఎనిమిది అర్ధశత, శత, ద్విశతావధానాలతో పాటు మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు. గరికపాటి రచనల్లో పద్యకావ్యాలైన సాగరఘోష, మన భారతం, పద్య కవితా సంపుటి బాష్పగుచ్ఛం, మా అమ్మ (లఘుకావ్యం), శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం) శతావధాన విజయం ముఖ్యమైనవి. ఎంఫిల్‌లో విశ్వవిద్యాలయంలో ప్రథమునిగా నిలిచిన గరికపాటిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు స్వర్ణ పతకంతో సత్కరించారు. గరికపాటిని 2011లో కొప్పరపుకవుల పురస్కారం వరించింది. లోక్‌నాయక్ పురస్కారానికి ఎంపికైన గరికపాటికి అవార్డుతో పాటు రూ.1.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు.
రైల్వే శ్రామిక యూనియన్ నాయకునిగా దశాబ్దాలుగా రైల్వే ఉద్యోగులకు, సిబ్బందికి సేవలందిస్తున్న చలసాని గాంధీకి లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. గవర్నమెంట్ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ పూర్తి చేసిన ఆయన నాలుగు దశాబ్దాల పాటు రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అఖిల భారతీయ రైల్వే ఉద్యోగుల సమాఖ్య (ఎఐఆర్‌ఎఫ్) సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే శ్రామిక్ యూనియన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.50వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. (చిత్రం) పురస్కార విజేతల వివరాలు తెలియచేస్తున్న లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్