లోకాభిరామం

భారతదేశం ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామంలో చెప్పుకునే సంగతుల గురించి నేను పడుతున్న బాధ చాలా మందికి తెలుసు. అందరికీ కనీసం ఆసక్తికరంగా ఉండే సంగతులు అందించాలని ప్రయత్నం. నా జన్యుశాస్త్ర పరిశోధనలో భాగంగా కొంత మానవీయ శాస్త్రంలో ఆసక్తి కలిగింది. ఆ రకం సమాచారం మీకు కూడా అందించాలనిపించింది. నా వంతు నేను చేస్తున్నాను. తరువాత మీ ఇష్టం.
భారతదేశంలో కకేషియన్‌లు, మంగోలియన్‌లు, ఆస్ట్రలాయిడ్‌లు, నెగ్రిటో లేదా నీగ్రాయిడ్‌లు అనే నాలుగు మానవ జాతులు కనపడతాయి. కకేషియన్ జాతి అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. తరువాత వరుసగా నెగ్రిటో, మంగొలాయిడ్, ఆస్ట్రలాయిడ్ జాతులు సంఖ్యాపరంగా ఉన్నాయి. సాంస్కృతికంగానూ, జన్యుపరంగానూ భారతదేశం బహుశా అన్నింటికన్నా వైవిధ్యంగల దేశం. మానవ పరిణామ క్రమంలో ప్రధానమయిన స్థానంగా ఈ దేశం నిలిచింది. హోమో శాపియెన్స్ అనే ఆధునిక మానవులు ఈ దేశంలోకి ప్రవేశించిన కాలం గురించి తగిన సమాచారం లేదు. అయితే ఆఫ్రికా నుండి మొదటి విడత జరిగిన వలసలు సుమారు క్రీ.పూ.లక్ష సంవత్సరాల నాటివి. ఆనాడు ప్రజలు భారత ఉపఖండానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎన్నో ప్రాంతాలకు విస్తరించారు. ప్లీస్టోసీన్ యుగపు కడపటి కాలం (క్రీ.పూ.65000 - 50000)లో కూడా ఈ వలసలు కొనసాగాయి. ఇక తూర్పు ఆఫ్రికా లేదా దక్షిణ యూరోపు నుండి వలసలు మధ్యరాతి యుగపు కాలంలో అంటే క్రీ.పూ.30000 సంవత్సరాల నాడు జరిగాయి. దక్కను, మధ్యభారతం, పంజాబ్ ప్రాంతాలలో దొరికిన రాతి అవశేషాలు ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. అలనాటి చిన్న రాతి ఆయుధాలు అటు ఫ్రాన్స్, ఇంగ్లండ్, తూర్పు ఆఫ్రికాలలో దొరికిన వాటిని పోలి ఉన్నాయి. అవి దక్షిణ భారతానికి వేటగాళ్లు ఆహారం సమీకరించే వారి కారణంగా చేరినట్టు కనపడుతుంది. ఈ మానవులు పాత రాతి యుగం నాటి వారికన్నా భిన్నమయినవారు. వలసలు అధునాతన యుగం వరకు కొనసాగాయి.
మీసోపొటేమియా, ఈజిప్ట్, పర్షియా ప్రాంతాల వారు పాత వేట, పచ్చిక బయళ్లలో బతికే పద్ధతి నుండి ఆహార సేకరణకు వ్యవసాయానికి మారుతున్న కొత్త రాతియుగం అంటే క్రీ.పూ.10000 నుండి 5000 సంవత్సరాల ప్రాంతంలో కనీసం ఆ కాలం నుండే అభివృద్ధి చెందిన వ్యవసాయం నాగరికత గల శాశ్వత ఆవాసాలు కూడా రూపం పోసుకున్నాయి. ఖంబాట్ సింధుశాఖ, గుజరాత్ తీరంలో జరిపిన సర్వేల కారణంగా అక్కడ ఏర్పడిన భూకంపాల వివరాలు తెలిశాయి. వాటి కారణంగా క్రీ.పూ.7,500 కన్నా ముందు కాలంలో భారతదేశంలో ఉన్న ప్రాచీన సంస్కృతులు బహుశా నాశనమయి మునిగిపోయి ఉంటాయి. ఇప్పటివరకు కనిపించిన కొత్త రాతియుగపు స్థానాలలో ఈ ఆవాసాలు బహుశా అన్నిటికన్నా ప్రాచీనమయినవి. ఈ ప్రాంతాలలో నిర్మాణానికి వాడిన వస్తువులు, రంధ్రాలు, బుడిపెలుగల పాత్రలు, వాటి ముక్కలు, పూసలు, ఎముకలు మొదలయినవి దొరికాయి. ఆ ప్రాంతంలో మానవులు క్రియాశీలంగా బతికారనడానికి ఇవన్నీ సూచనలు. ఇక 30 నుండి 40 మీటర్లు (100 నుండి 130 అ.) లోతున నేలలో నదుల అవశేషాలు కూడా కనిపించాయి. గుజరాత్‌లోని సూరత్ దగ్గర 20 కి.మీ. దూరంలో హజీరా ప్రాంతంలో ఈ అవశేషాలు కనిపించాయి. ఇంకా రాతియుగపు శిలా ఆవాసాలు మధ్యప్రదేవ్‌లోని భీంభేడ్కాలో కనిపించాయి. అక్కడ కొన్ని చిత్తర్వులు కూడా కనిపించాయి. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో మెహర్‌గఢ్ గ్రామంలో వ్యవసాయం అవశేషాలు దొరికాయి. క్రీ.పూ.7000 సంవత్సరాల నాటివిగా గుర్తించిన ఈ అవశేషాలన్నీ అలనాటి వైదిక మరియు సరస్వతీ సింధు లోయ నాగరికతలో భాగాలు.
దక్షిణ భారతదేశంలో నివసించిన తొలి మానవులు క్రీ.పూ.50,000 సంవత్సరాల నాటి ఆస్ట్రో - ఏషియాటిక్ వేట - సేకరణ తెగలకు సంబంధించిన వారు. వీరి సంతతుల వారిని ఆదివాసులు (మొదట స్థిరపడినవారు) లేదా ఆది ద్రావిడులు (మొదట నివసించినవారు) అన్నారు. ఈ ఆదివాసుల ఆచార వ్యవహారాలను పొరపాటున హిందూ మతంగా కొందరు వివరించారు. ఆదివాసుల వలె కాక ద్రావిడులు వ్యవసాయపరులు వ్యవసాయం కారణంగా తమ జనాభాకు 50 రెట్లు ఎక్కువ గల వేటాడే వారికి కూడా తిండి అందుతుంది. కనుకనే ద్రావిడుల జనాభా త్వరలోనే ఆదివాసులకన్నా ఎంతో పెరిగింది.
వైదిక ఆర్యులు
మాక్స్ ముల్లర్, 1853లో ఆర్యుల జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సమయంలో ఇంగ్లీషు యూరోపియన్ భాషలలో ఇక్కడి జాతులను, భాషా వర్గాలను సూచించడానికి ఆర్యులు అన్న మాట వాడుకున్నాడు. కొంతకాలం తరువాత ఈ సిద్ధాంతాన్ని పక్కకు నెడుతూ ఆర్యన్ దండయాత్ర/ వలస సిద్ధాంతం ప్రతిపాదింపబడింది. అది కూడా యూరోపియన్‌ల వల్లనే జరిగింది. అయితే వైదిక, వైదికానంతర సాహిత్యాలలో మాత్రం ఒక జాతి, భాషను సూచిస్తూ ఆర్యులు అన్న శబ్దం వాడినట్టు కనపడదు.
ఆర్య అన్న సంస్కృత శబ్దంలో ‘ర్’ అన్న ధాతువు ఆధారంగా ఉంది. దానికి అకారం చేర్చితే అసలు అర్థానికి వ్యతిరేకమయిన భావం వస్తుంది. ఈ రకంగా వచ్చిన శబ్దానికి ఆంగ్లంలో అర్థాలు చెపితే ‘అత్యుత్తములు, ఉత్తములు, విలువగలవారు, గౌరవనీయులు, ఆదరణీయులు’ అని లేదా నామవాచకంగా ‘యజమానులు, ప్రభువులు’ అని అర్థాలు వస్తాయి. ఇక ఆర్య శబ్దానికి ‘బోధకుడు, యజమాని, పెద్దమనిషి, పిల్లనిచ్చిన మామగారు, మిత్రుడు, బుద్ధి కలిగిన జ్ఞాని’ అని కూడా అర్థాలు ఉన్నాయి. వైదిక సాహిత్యంలో ఈ మాటను ‘పెద్దమనిషి, సుస్వభావం కలవాడు, ధర్మపరుడు, ఉన్నతుడు’ వంటి అర్థాలకు వాడుకున్నారు. సర్ అన్న మాటకు సమానంగా దీన్ని వాడుకున్నారు.
ఋగ్వేదంలో ఆర్య అన్న శబ్దం వైదిక ఆర్యులను మాత్రమే సూచిస్తుంది. వారు తమను ఆర్యులుగా సంబోధించుకున్నప్పుడు ‘గొప్పవారమయిన మేము’ అన్న అర్థంతో వాడుకున్నారు. అయితే ఉదాహరణకు ఒక ఇరాన్ దేశస్థుడు ‘ఐర్య’ అన్న శబ్దాన్ని వాడతాడు. అప్పుడు నిస్సందేహంగా దానికి అర్థం ‘ఇరాన్ దేశస్థుడు’ అని మాత్రమే. అక్కడి ప్రత్యేక తెగలు, వర్గాల వారిని కూడా ఈ రకంగా పిలిచి ఉండవచ్చు. వారు తమను తాము వైదిక ఆర్యులుగా చెప్పుకునే ప్రయత్నం మాత్రం కలలో కూడా చేయలేదు. ఈ విషయాన్ని ‘ఎయిరే’ అనే మాటకు కూడా వర్తింపజేసి చెప్పవచ్చు. ఐరిష్ దేశవాసులను ఈ పేరుతో పిలుస్తారు. వైదిక ఆర్యులు మాత్రం ఆర్య శబ్దాన్ని ప్రత్యేకమయిన అర్థంతో వాడుకున్నారు. ఇతరుల నుండి తమను తాము ఈ పేరుతో వేరుచేసి చెప్పుకున్నారు. యూరోపియన్‌లు, ఇతరులందరూ ఆర్యులు కారు, వైదిక ఆర్యులు అంతకన్నా కారు. ప్రాచీన గ్రంథాలలో వారిని ‘పురు’ అనే పేరుతో సూచించారు.
శతపత బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం అన్న వైదిక గ్రంథాలలో వైదిక ఆర్యుల భూభాగాలు పడమట గాంధారం (ఆఫ్గనిస్తాన్) నుండి తూర్పున విదేహ (నేపాల్) వరకు ఇక దక్షిణాన విదర్భ (మహారాష్ట్ర) వరకు విస్తరించినట్టు రాసి ఉంది. క్రీ.పూ.2000 ముందు కాలం నుంచే ఈ ప్రాంతాలలో వైదిక ప్రజలు ఉన్నట్టు ఈ రకంగా సూచనలు అందుతాయి.
ఆర్యులు, ద్రావిడులు కకేషియన్ జాతిలోని వేరువేరు శాఖలకు చెందినవారు. యూరోపియన్ తెల్లవారు ఈ జాతివారలుగా చెప్పుకుంటారు. భారత ఉపఖండంలో ఉత్తర భాగంలో నివసిస్తున్న ఆర్యులు, ఇక దక్షిణ భారతంలో ఉన్న ద్రావిడులకు మధ్యన ఉన్న తేడాలు జాతిపరమయినవి కావు. వీరందరూ కకేషియన్ తెగ నుంచి వచ్చినవారే. భూమధ్య రేఖకు సంబంధించి ఆయా ప్రజలు జీవించిన ప్రాంతాలను బట్టి తేడాలు వచ్చాయి. భూమధ్య రేఖకు చేరువగా ఉన్నవారి చర్మం ముదురు రంగులో ఉంటుంది. అక్కడి నుండి దూరంగా ఉన్నవారికి తేలిక రంగు ఉంటుంది. పైగా భూమధ్య రేఖ ప్రాంతపు తీవ్రమయిన వేడిమి కారణంగా వేల సంవత్సరాలలో అక్కడి ప్రజల శరీరాలు కురచగా మారాయి. జైవిక వాతావరణ సంబంధ పరిణామ క్రమంలో ఇటువంటి లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. ఉత్తర భారతీయులు, ద్రావిడులకు మధ్యన గల రంగు తేడా యూరోపులోని కకేషియన్ జాతులలో కూడా కనిపిస్తుంది. అంటే కకేషియన్‌లు రకరకాల రంగులు గల చర్మంతో ఉంటారు. తెల్లని తెలుపు నుంచి నలుపు దాకా, ఆ మధ్యన వీలయిన అన్ని రకాల ఛాయలలోనూ ఈ మానవులు ఉన్నారు.
చర్మం రంగు ఈ రకంగా నలుపు నుండి తేలిక రంగు వరకు ఒక క్రమంలో మారుతూ కనిపిస్తుంది. దీనికి ఆధారంగా ఎక్కువ సంఖ్యలో జన్యువులు ఉంటాయి. అంటే లక్షణానికి కారణం ఒకే జన్యువు కాదని అర్థం. ఈ జన్యువులను ఇంకా గుర్తించలేదు. చర్మం రంగుకు కారణమయినవిగా ఎంసి 1 ఆర్ జన్యువు, అలాగే ఎస్‌ఎల్‌సి 24 ఎ5 అన్న మరొక జన్యువులను మాత్రం గుర్తించారు. ఇందులోని రెండవ జన్యువులో తమంత తాముగా వచ్చిన మార్పుల కారణంగా రంగుల తేడా వస్తుంది. ఈ కొత్త రకం జన్యువు యూరోపు ప్రాంతంలో 6000 నుండి 12000 సంవత్సరాల మధ్యకాలంలోనే పొడసూపినట్లు కనుగొన్నారు. అంటే యూరోపు జాతులలో వారు ఎక్కువ మంది తేలిక రంగు చర్మాన్ని కలిగి ఉండడానికి కారణమయిన జన్యువు ఇటీవలి కాలంలో మాత్రమే ఏర్పడిందని అర్థం. ఆఫ్రికన్ - యూరోపియన్ కలగలపు సంతతి వారమయిన ప్రజలలో ఈ రెండవ జన్యువు యొక్క ఒక రూపాంతరం ఉన్నట్లు కనుగొన్నారు. అందువల్లనే ఈ కలగలపు పూర్వీకుల కారణంగా చర్మం రంగు మారినట్టు తెలిసింది. ఈ పరిశీలన కారణంగా యూరోపు, ఆఫ్రికన్ జాతుల వారిలో 25 నుండి 38 శాతం వరకు రంగు తేడా వచ్చినట్టు కనుగొన్నారు.
50 సంవత్సరాల నాడు జరిగిన ఒక జనాభా జన్యు పరిశీలన కారణంగా భారత ఉపఖండంలో ఉన్న ప్రజలు వారికి సమీపంలోనే ఉన్న యూరోపు వాసులు కూడా ఒకే ఒక కకేషియన్ జాతి నుండి వచ్చినవారని తెలిసింది. భారతీయ జనాభా ఎక్కువగా స్థానికులు, వారిలోకి గడచిన హిమయుగం (హోలోసీన్: సుమారు క్రీ.పూ.500) నాడే జన్యు ప్రవాహం చాలా తక్కువగా జరిగినట్టు తెలిసింది. ఇక భారతీయులలోని ఔత్తరాహికులు, ద్రావిడుల మధ్యన జాతిపరంగా తేడా లేనేలేదు. వేలాది సంవత్సరాలుగా ఈ జాతులు ఒకటిగానే కొనసాగాయి. కాకసాయిడ్ అనబడే ఎం 17 అనే జన్యు మార్కర్ భారతీయులలో ఎంతో వైవిధ్యంగా అయినా సరే చాలా ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. అంటే ఎం 17 అనే పురుషుల ద్వారా మాత్రమే సంక్రమించే జన్యు పదార్థం భారతీయ జనాభాలో చాలా ప్రాచీనమయినదిగా ఉన్నట్టు లెక్క. ఇక జాతి అన్నది వైజ్ఞానిక ఆధారం లేని కేవల సాంఘిక భావన అన్నది ఈ రకంగా రుజువు అవుతుంది.

-కె.బి.గోపాలం