లోకాభిరామం
మరోసారి హాకింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఊళ్లో ఎవరయినా పుట్టారా? అన్నది ప్రశ్న. లేదండీ, అందరూ చిన్నపిల్లలే పుడుతున్నారు అని జవాబు. ఈ ప్రపంచంలో పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదు. గొప్ప పనులు చేసినందుకు గొప్పవారు అవుతారు. గొప్పగా రాసినవారు చాలామంది ఉండవచ్చు. గొప్ప సైన్స్‌ను అందించినవారు అంతమంది లేకపోవచ్చు. కానీ ఎవరూ చేయని పనిచేసి ఎవరూ నడవని దారిలో నడిచినవారు చాలా తక్కువమంది ఉంటారు. అటువంటి వారిని గురించి వరుసబెట్టి పుస్తకాలు రాయాలి అని నా ప్రయత్నం. ఆ పుస్తకాల వరుసకు కొత్తదారులు అని పేరు పెట్టాను. చంద్రునిమీద దిగడానికి ఏమాత్రం జంకని ఆర్మ్‌స్ట్రా ంగ్‌తో వరుసను మొదలుపెట్టాను. ఆ తరువాత నేను అభిమానించిన న్యూటన్ గురించి రెండవ పుస్తకం రాశాను. మూడవ పుస్తకం జేన్ గుడాల్ గురించి. ఈవిడ ఎవరో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. చిన్న వయసులోనే ఆఫ్రికా అడవులకు చేరి బతుకంతా అక్కడే గడిపి చింపాంజీలే కుటుంబంగా బతికిన పరిశోధకురాలు జేన్ గుడాల్. ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు. వాడు చింపాంజీల మధ్యనే పుట్టాడు. ఈ పుస్తకాలు సిద్ధమయినయి. ప్రచురణకర్తల వద్ద ఉన్నయి. అవి బయటికి రావాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను.
పుస్తకాల వరుస అన్నాను గనుక తరువాత ఐన్‌స్టైన్ గురించి ఒకటి, ఆ తరువాత స్టీఫెన్ హాకింగ్ గురించి ఒకటి పుస్తకాలు రాయాలని సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకున్నాను. హాకింగ్ బతికి ఉండగా పుస్తకం వస్తే ఎంత బాగుండేదో? ఇప్పుడయినా మించిపోయింది లేదు. పుస్తకం రాస్తాను. పిల్లలకు కూడా పనికివచ్చే పద్ధతిలో రాసింది చాలదు. హాకింగ్ గురించి సవివరంగా ఒక పెద్ద పుస్తకం కూడా రాయాలి. ఈ రకంగా నేను చేయవలసిన పనులు చాలా బోలెడు ఎదురుచూస్తున్నాయి. నేను మాత్ర ం ఓడిపోదలచుకోలేదు. వీలువెంట ఆ పనులు చేయడమే నాకు మిగిలిన కార్యక్రమం.
స్టీఫెన్ హాకింగ్ చాలా రాశాను. వాటిలో 1988లో బయటకు వచ్చిన ఏ బీ ఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం ఇప్పటికి కోటి కాపీలు దాటింది. నిజానికి ఈ పుస్తకం తెలుగులో కూడా వచ్చింది. మరొక 35 భాషల్లో వచ్చింది. పీకాక్ పబ్లిషర్స్ మిత్రులు గాంధీగారు దాన్ని తెలుగు చేశారు. ఇంగ్లీషులోనే నాకు ఆ పుస్తకం అర్థం కాలేదు. ఆ సంగతి హాకింగ్‌కు కూడా అర్థమయింది. కనుక బొమ్మలతో సహా మరింత వివరంగా మరొక పుస్తకం వేశాడు. నాకు అది కూడా అర్థం కాలేదు. సంబంధించిన సంగతులన్నీ చదివితే అర్థం అయ్యే అవకాశం ఉంది. అర్థం చేసుకోవాలి. అప్పుడు మరికొంతమందికి చెప్పే వీలు ఉంటుంది.
హాకింగ్ కదలడానికి కూడా చేతకాని మనిషి. కుర్చీలోనే బతికాడు. అది మామూలు కుర్చీకాదు. అతను పోయిన తరువాత ఆ కుర్చీ ఆధారంగా కార్టూన్‌లు కనిపించాయి. మోటరైజ్‌డ్ చక్రాల కుర్చీలో అతను తనంతకు తాను క్లాస్ చెప్పడానికి వెళ్లడం నేను వీడియోలో చూశాను. అతని క్లాస్ అంటే ఆ క్లాస్ విద్యార్థులే కాక వీలయినంత మంది మిగతావాళ్లు కూడా వచ్చి చేరేవారు. ఆ దృశ్యాలను కూడా నేను చూశాను. ఇంతరకూ హాకింగ్‌కు మాటలు రావు. మనసులో లేవని కాదు. అతని నోటికి మాటలు రావు. అతని కొరకు స్పీచ్ సింతసైజర్ అని ఒక యంత్రాన్ని తయారుచేసి ఇచ్చారు. దాని సాయంతో అతను మాటలను పేర్చుకుంటాడు. క్లాస్‌లు తీసుకుంటాడు. ఉపన్యాసాలు చెబుతాడు. ప పంచంతో సంగతులు పంచుకుంటాడు. మానసిక బలం అంటే ఇంతకంటే గొప్పగా ఎక్కడా ఉండదు.
అనుకున్న గురువు దొరకకున్నా గురువులతోనే అతను పోటీపడుతూ పరిశోధనలు చేశాడు. అప్పటివరకు అందరూ అంగీకరించిన సిద్ధాంతాలను కాదు పొమ్మన్నాడు. ఇక్కడ వివరాలు రాస్తే లోకాభిరామం పద్ధతికి కొంచెం తేడా వస్తుంది. సైన్స్ చెప్పినా నేను సైన్స్‌లాగ వినిపించకుండా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. హాకింగ్స్ పరిశోధన అంత సులభంగా మాటలకు అందేది కాదు. న్యూటన్, ప్లాంక్స్, ఐన్‌స్టైన్, బోల్డ్స్‌మన్ అనే నలుగురు ఉద్దండ పిండాలయిన సైంటిస్టులు చేసిన సిద్ధాంతాలను ఈయన తిరగరాసి ఒక కొత్తదారి వేశాడు. దానితో థియరీ ఆఫ్ ఎవరిథింగ్ అనే కొత్త సిద్ధాంతానికి దారిపడింది. అది విశ్వం పుట్టుక, దాని పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ గొప్ప సిద్ధాంతాలను కాదు అనడం ఒక ఎత్తయితే కొత్త సిద్ధాంతాన్ని నిలబెట్టడం మరొక ఎత్తు. హాకింగ్ ఆ ప్రయత్నంలోనే చివరినాటి వరకు కృషి చేస్తూ వెళ్లాడు. తాను నమ్మిన విషయాలను అందరికీ అందించే ప్రయత్నంలోనే అతని జీవితం గడిచిపోయింది.
సులభంగా చెప్పాలంటే ఈ విశ్వం పుట్టినప్పుడు పెద్ద పేలుడు జరిగింది అని అందరూ అంటారు. చుట్టూ వాతావరణం ఉంటే చప్పుడు వినిపిస్తుంది. విశ్వం పుట్టినప్పుడు ఏమీ లేదు. ఆ ఏమీలేదులో పేలుడు జరిగినా ఎవరికీ వినిపించదు. గురువుగా హాకింగ్ స్వీకరించదలచిన ఫ్రెడ్ హాయిల్ విశ్వం పుట్టుక, పెరుగుదల గురించి పరిశోధనలు సాగించాడు. చాలామంది విశ్వం పెరుగుతున్నది అన్నాయి. హాయిల్ మాత్రం మరొక రకంగా చెప్పాడు. విద్యార్థిగా ఉండగానే హాకింగ్ ఆ అంశాన్ని వ్యతిరేకించాడు. ఒకవేళ హాయిల్ వద్దనే హాకింగ్ పరిశోధన చేయలవసి వస్తే గురుశిష్యుల మధ్యన పెద్ద పేచీ మొదలయ్యేది. అది రాకుండానేమో హాకింగ్‌కు ఫ్రెడ్ హాయిల్ వద్ద పరిశోధన చేసే అవకాశం అందలేదు. మరొక గురువు నిజానికి శిష్యుడిని ఏ విషయంలోనూ కట్టిపెట్టాలని ప్ర యత్నించలేదు. అటువంటి స్వతంత్రం లేకుంటే కొన్ని రకాల పరిశోధనలు, ముఖ్యంగా సిద్ధాంతపరమైన పరిశోధనలు ముందుకు సాగవు. గౌరవం వేరు, తాను నమ్మిన విషయం వేరు. కనుకనే హాకింగ్ కొన్ని విషయాలలో ఐన్‌స్టైన్ ను కూడా కాదనగలిగాడు.
ఐన్‌స్టైన్ చెప్పిన పద్ధతి ప్రకారం విశ్వం పుట్టిన నాటి రూపంగల నిర్మాణాలు మళ్లీ ఒకసారి రావాలి. ఈ విషయం గురించి వివరం చెప్పడానికి పూనుకుంటే బహుశా ముందు నాకే తికమక పుడుతుంది. ఒక నిర్వచనం లేని మహా నిర్మాణం నుండి పేలుడు ద్వారా విశ్వం పుట్టింది. అది పేరుకు మాత్రమే మహా నిర్మాణం. దానికి కొలతలు లేవు. బ్లాక్‌హోల్స్ అందరూ అనుకుంటున్నట్టు పదార్థాలను అన్నింటినీ మింగుతూ ఉంటే చివరికి విశ్వం పుట్టుకకు కారణమయిన వింత నిర్మాణం మళ్లీ రావాలి. కానీ అది రాలేదు. రాదు కూడా అని తేల్చి చెప్పాడు హాకింగ్. కనుకనే బ్లాక్‌హోల్స్ అందరూ అనుకుంటున్న రాక్షస నిర్మాణాలు కావు అన్నాడు.
నక్షత్రాలు పెట్టే నెబ్యూలాలు అనే నిర్మాణాలు ఉంటాయి. చెపితే నమ్మరుగానీ, నక్షత్రాలు చనిపోతాయి. అవి సూపర్‌నోవాలుగా మారుతాయి. మరో కొన్ని నిర్మాణాలుగా మారతాయి. ఈ పద్ధతిలోనే బ్లాక్‌హోల్స్ కూడా పుడతాయి. వాటి తీరు కారణంగా అవి దగ్గరకు వచ్చిన పదార్థాన్ని తమలోకి పీల్చుకుంటాయి. ఇప్పటివరకు తెలిసింది ఇంతే. కానీ హాకింగ్ కొన్ని విషయాలను సిద్ధాంతపరంగా ఖండిస్తూ తన ప్రతిపాదనలను చేశాడు. ప్రపంచంలోని భౌతిక శాస్తవ్రేత్తలు ఎందరినో పనిలోపెట్టాడు. వారి మెదళ్లకు కావలసినంత కార్యక్ర మం దొరికింది.
స్టీఫెన్ హాకింగ్ గురించి ఒక ఫిల్మ్ తీయాలని 1991 ప్రాంతంలో ప్రయత్నించారు. ఫిల్మ్ వచ్చింది. అయితే అప్పటికి ఆయన చేసిన ఆలోచనలు అన్నీ ఆ ఫిల్మ్‌లో చూపించలేకపోయారు. గంట నిడివి చిత్రంలో అరగంటసేపు హాకింగ్ గురించి చెప్పడంతోనే సరిపోయింది. అతను నిజానికి అంత వింత మనిషి. అందుకే అతడిని నేను మహామానవుడు అన్నాను. కాళ్లు, చేతులు కదలని ఆ మనిషి టి.వి. కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాడు. నాసావారి ఒకానొక కార్యక్రమంలో ‘అంతరిక్షమా, నేను వస్తున్నాను’ అంటూ వెళ్లి భారరహిత స్థితిని రుచి చూచాడు. హాకింగ్ మరణించిన తరువాత నాసా వారి ఈ ప్రయోగం చిత్రం నెట్‌లోనూ, పత్రికలలోనూ ఎక్కడ చూచినా కనిపించింది. అందులో ఉన్న ప్రత్యేకతను ఎంతమంది గుర్తించారో తెలియదు. ముగ్గురు వ్యోమగాములు హాకింగ్‌ను నిరాధారంగా మధ్యలో అడ్డంగా పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏ వస్తువు కిందపడదు మరి. కండరాలు ఏవీ పనిచేయని హాకింగ్ చేతులు కట్టుకుని ఉంటాయి. కానీ ఆ మహామానవుడు ఆ ప్రయోగంలో పాల్గొన్న సంతోషంతో నవ్వడానికి ప్రయత్నించిన సంగతి ఆ బొమ్మలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. పాపం మహామానవునికి నవ్వడం చేతకాదు. అయినా నవ్వాడు.
హాకింగ్ మరణించిన రోజు తెలుగు పత్రికల వాళ్లకు, టి.వి. ఛానళ్లకు ఆయన గురించి నాలుగు మాటలు చెప్పడానికి ఎవరూ దొరకలేదు. ప్రస్తావన నా ముందుకు వచ్చింది. నేను ఒప్పుకున్నాను, ఒప్పుకోలేదు. మొత్తానికి ఆయన గురించి ఎవరూ అంతగా మాట్లాడిన ఆధారం కనిపించలేదు.