జాతీయ వార్తలు

ట్రంప్‌ను మోదీ అడగలేదు: జైశంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అడగలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ పాక్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరిస్తామని అన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలు సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేస్తేనే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. కశ్మీర్ అంశం జాతీయ అంశమని, ఒకే గొంతుతో జాతీయ ఐక్యతకు కట్టుబడి వుండాలని చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు.