విశాఖపట్నం

లోకేష్‌తో ఎమ్మెల్సీ మూర్తి, ఎమ్మెల్యేల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నగరంలో పర్యటించాలని అభ్యర్థన
* నెలాఖర్లో లేదా జనవరిలో వస్తానని హామీ
విశాఖపట్నం, డిసెంబర్ 8: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఎమ్మెల్సీ ఎంవివి మూర్తి, ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు మంగళవారం నాడిక్కడ భేటీ అయ్యారు. విశాఖ గ్రామీణ జిల్లాలో సోమవారం జరిగిన జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన లోకేష్ బస చేసిన హోటల్‌లో కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మూర్తి, ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు భరోసా నిచ్చే విధంగా నగరంలో కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేష్ డిసెంబర్ చివర లేదా జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు లోకేష్‌ను కలిశారు.

నెలాఖరుకు సుందరీకరణ పూర్తి
* వుడా విసి బాబూరావు నాయుడు
విశాఖపట్నం, డిసెంబర్ 8: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, విశాఖ ఉత్సవ్‌ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన నగర సుందరీకరణ పనులు ఈనెలాఖరుకు పూర్తికానున్నాయని వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు తెలియచేశారు. మంగళవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్ సందర్భంగా వుడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలియచేశారు. కైలాసగిరిపై లేజర్ షో నిర్వహించనున్నారు. అలాగే ఎంజిఎం ఉడా పార్క్‌లో ఫ్లవర్ షో ఏర్పాటు చేయనున్నారు. 23,24 తేదీల్లో కురుసుర సబ్‌మెరైన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఆ మరునాడు ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో రంగోలీ నిర్వహించనున్నట్టు బాబూరావు వివరించారు.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని దృష్టిలో పెట్టుకుని నగర సుందరీకరణ పనులు చేపట్టిందని తెలియచేశారు. ఎయిర్‌పోర్టుతో సహా మిగిలిన ప్రాంతాల్లో ల్యాండ్ స్కేప్ పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తవుతాయని అన్నారు. ఎయిర్‌పోర్టు సుందరీకరణ పనులు కొలిక్కి వచ్చాయని తెలియచేశారు. అలాగే సింహాచలం ఆర్చ్ నుంచి గోశాల వరకూ రోడ్డు విస్తరణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని ఆయన తెలియచేశారు.