రాష్ట్రీయం

కేసుల పరిష్కారం కష్టమవుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవాలుగా మారిన జ్యుడీషియరీ నిర్వహణ
జస్టిస్ మదన్ బి లోకూర్ ఆవేదన

హైదరాబాద్, నవంబర్ 21: న్యాయవ్యవస్థ నిర్వహణలో తలెత్తుతున్న సవాళ్లను సమర్ధంగా పరిష్కరించేందుకు భారతీయ న్యాయ వ్యవస్ధ సన్నద్ధంగా ఉందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడకు సమీపంలోని శంకరపల్లి వద్ద సుప్రీం కోర్టు, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తుల సమావేశం జరిగింది. సమావేశంలో భారతీయ న్యాయ వ్యవస్థ, ఎదురవుతున్న సవాళ్లు అంశంపై జరిగిన సదస్సులో లోకూర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్ధ ఫలాలను అందించే విధానంలో సమూలంగా మార్పులు తేవాలన్నారు. న్యాయ వ్యవస్థ తీర్పులను సకాలంలో అందించలేకపోతోందని, సుప్రీం కోర్టు, హైకోర్టులో కేసులు పేరుకుపోతున్నాయన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 65వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. మేనేజిమెంట్ నిపుణుల సహాయం తీసుకుని న్యాయ వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. సామాజిక మాధ్యమాలు, న్యాయమూర్తుల జవాబుదారీతనం, తీర్పులను వెలువరించడంలో జరుగుతున్న జాప్యం తదితర అంశాలు న్యాయవ్యవస్థ ముందున్న సవాళ్లన్నారు. ప్రభుత్వం న్యాయ సంస్థలకు మంజూరు చేసే నిధులతో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సి లాహోటి మాట్లాడుతూ జిల్లా కోర్టునుంచి సుప్రీం కోర్టు వరకు డిజిటల్ వ్యవస్థను అనుసంధానం చేయాలన్నారు. కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అన్ని కోర్టుల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విశ్రాంత న్యాయమూర్తులు ప్రజలకు న్యాయ సలహాలు అందించాలని, లోక్ అదాలత్ వంటి వాటిల్లో పాల్గొనడంతో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి న్యాయ సంబంధమైన విషయాల్లో తోడ్పాటు అందించాలన్నారు. హైదరాబాద్ కామన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై న్యాయమూర్తులు అందించిన సలహాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తుల సంఘం కార్యదర్శి జస్టిస్ ఎకె శ్రీవాత్సవ్, సౌత్ ఇండియన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ జస్టిస్ వి భాస్కరరావు, అనేకమంది న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. ** సుప్రీం కోర్టు, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తుల సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న సుప్రీం కోర్టు జస్టిస్ మదన్ బి లోకూర్ **