జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటమి
భోపాల్, నవంబర్ 24: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న బిజెపికి మంగళవారం మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం-జబువా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బిజెపి అభ్యర్థి నిర్మలా భురియాను కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా మట్టికరిపించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బిజెపి అభ్యర్థి దిలీప్ సింగ్ భురియా మృతిచెందడంతో ఉప ఎన్నికలో ఆయన కుమార్తె నిర్మలా భురియాను రంగంలోకి దింపారు. ఈ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా 88,832 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే దేవాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గాయత్రి రాజే పువార్ 30,778 ఓట్ల తేడాతో జైప్రకాష్ శాస్ర్తీ (కాంగ్రెస్)పై గెలుపొందడం కాస్త ఊరటనిచ్చింది. ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తుకోజీరావు పువార్ మృతిచెందడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. దీంతో తుకోజీరావు భార్య గాయత్రి రాజేను బిజెపి పోటీకి నిలబెట్టింది.