మెయిన్ ఫీచర్

మేలిముసుగు మేలు కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయానే్న వంటగదిలో హడావుడి పడుతున్న భార్యతో భర్త- ‘నా పర్సులో డబ్బు ఏమైనా తీశావా?’ అన్నాడు.
పనితో చిరాగ్గా ఉన్న ఆమె ‘నేనెందుకు తీస్తాను, తీసేంత టైమెక్కడ ఉంది, తీసినా సరదాలు తీర్చుకునే అవకాశమెక్కడుంది?’ అంది.
‘అది కాదోయ్.. నువ్వు డబ్బు తీసి ఖర్చుపెట్టేసుకుంటున్నావని అనలేదు. పెట్రోలు పోయించుకుందుకు వెయ్యి రూపాయలు నిన్న రాత్రి పర్సులో ప్రత్యేకంగా పెట్టుకున్నాను. కనిపించడం లేదు. నువ్వు తియ్యలేదంటే- పనిమనిషి కానీ..’ అంటూ ఆగిపోయాడు.
భార్యకు పనిమనిషిని మించిన ఆపద్బంధువులు లేరు. అందుకే ఆమెనేమీ అనడానికి లేదు.
‘ఇంతకీ పర్సు ఎక్కడ పెట్టారు?’ అంది ఇల్లాలు.
‘నా కంప్యూటర్ బ్యాగ్ పక్కనే టేబుల్ మీద’ అన్నాడాయన.
‘చాలా బాగా పెట్టుకున్నారు.. కళ్ళెదుట పర్సుంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. అనవసరంగా దాన్ని అనడమెందుకు? మన బుద్ధి మనకుండాలి’ అందావిడ. కిమ్మనలేదాయన.
... ఇదే సంఘటనను కొంచెం మార్చి- స్ర్తిల విషయంలో ఎవరైనా అంటే కొంపలంటుకుపోతాయి. ‘అమ్మాయిలు అందం ప్రదర్శన విషయంలో జాగ్రత్తగా ఉండాలి..’ అంటేనే మహిళా లోకం మగవారిపై దుమ్మెత్తిపోస్తుంది. ఇది పురుషాధిక్య సమాజమనీ, పితృస్వామిక సంఘమనీ, మగాళ్ళు అందరూ మృగాళ్ళనీ అంటారు. లోకులందరూ దొంగలు కారు, దొంగలలో కూడా రకరకాలుగా ఉంటారు. కత్తి చూపి కానీ, పొడిచేసి కానీ దోచుకునేవారు కొందరు. ఏమరపాటుగా ఉంటే దొంగిలించేవారు కొందరు. మాయమాటలు చెప్పి మోసగించేవారు కొందరు. బీరువా పగలగొట్టేవారు కొందరు. పర్సు ఎదురుగా కన్పిస్తే చేతివాటం ప్రదర్శించేవారు కొందరు. దొంగలందరినీ ఒకే గాట కట్టెయ్యలేము. మనం జాగ్రత్తగా ఉంటే చాలా సందర్భాలలో సొమ్ము పోకుండా కాపాడుకోవచ్చు.
ఉదయం పూట వాకింగ్ చేసే స్ర్తిలవీ, స్కూటర్‌మీద వెడుతున్న మహిళలవీ బంగారు గొలుసులు పోతున్నాయని వార్తలు ఇపుడు పదే పదే వస్తున్నాయి. గొలుసులు పోయినట్లుగా గాజులు దొంగిలింపబడవు. మెడలోని గొలుసుని కత్తిరించి లాగెయ్యడం సులభం. కానీ, మెడలో గొలుసు వేసుకున్న మహిళ తన మెడనూ, భుజాలనూ చీర కొంగుతోనో, చున్నీతోనో కప్పుకుంటే దొంగ లాగేసుకోవడం కష్టమవుతుంది. బంగారంతో మెడను సింగారించుకునే మహిళలు ఆలోచించవలసిన విషయమిది.
విలువైన బంగారం భూమిమీద ఎక్కడ లభిస్తుంది? లోతుగా వుండే గనులలో అరుదుగా లభిస్తుంది. బంగారం కావాలంటే భూమిలో లోతుగా తవ్వాలి. కష్టనష్టాలకు ఓర్చి ఖనిజాన్ని పైకి తీసుకురావాలి. తెచ్చిన దాన్ని శుద్ధి చెయ్యాలి. ఎన్నో ప్రయత్నాలు చేశాక, ఎంతగానో శ్రమించాక కానీ బంగారం లభ్యం కాదు. బంగారం కన్నా విలువైన వజ్రాలు లభించడం ఇంకా కష్టం. విలువైనవేవీ నేలమీద సులభంగా దొరకవు. ఇది ప్రకృతి ధర్మం.
ఈ ధర్మాన్ని స్ర్తి శరీరం విషయంలో ఎందుకు విస్మరిస్తున్నాం? విలువైన వస్తులన్నిటినీ ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం. ఈ ఒక్క దాంట్లోనూ నియమాన్ని ఉల్లంఘించడం తప్పు కాదా? అలా అడిగిన ప్రతి ఒక్కరినీ నిందించడం నేడు పరిపాటి అయిపోయింది. ‘నిర్భయ’ కేసులో అత్యాచారానికి గురై మరణించిన అమ్మాయి మీద జాలి తప్పకుండా అందరికీ వుంటుంది. కానీ, ‘అర్ధరాత్రి వేళ ఒకమ్మాయి ప్రైవేటు బస్సు ఎక్కకుండా ఉండాల్సింది..’ అన్న రాష్ట్ర మంత్రి చేత క్షమాపణ చెప్పించేదాకా మహిళా సంఘం శాంతించలేదు. పార్లమెంటు సభ్యుడైన ప్రముఖ నటుడొకరు- స్ర్తిలు వస్తధ్రారణలో జాగ్రత్త వహించాలని అంటే- ‘మీరు నటించిన సినిమాల్లో హీరోయిన్లు ఎలా డ్రెస్ చేసుకున్నారు..?’ అని ప్రశ్నించారు. సినీ హీరోయిన్లు స్వయంగా రక్షణ కల్పించుకోగలరు. అందరు స్ర్తిలకూ అది సాధ్యమా?
అర్ధరాత్రి స్ర్తి ఒంటరిగా బయట తిరగగలిగినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారని అస్తమానం వింటూంటాం. దేశానికి రాజకీయ స్వాతంత్య్రం బ్రిటీషు ప్రభుత్వాన్నుంచి రాకముందు కూడా స్ర్తిలు అవసరపడినప్పుడు బయట తిరగగలిగేవారు. 1930 ప్రాంతాలలో ఒక పాతికేళ్ళ మహిళకు ఇల్లు కదిలి బయటకు వెళ్ళే అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మద్రాసు మహానగరంలో ఆమె భర్తకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. అర్ధరాత్రి సమయం. ఆ రోజుల్లో టెలిఫోన్ కాదు కదా కరంటు దీపాలు కూడా అరుదే. డాక్టర్లే రోగుల ఇంటికి వచ్చేవారు. ఆమె రాత్రి వేళ డాక్టర్ని పిల్చుకుని రావడానికి వెళ్లాల్సి వచ్చింది. చదువురాదు, తెలుగు తప్ప మరో భాష తెలియదు. ఊరు కొత్త. రోడ్డుపై నడుస్తుండగా ఒక అపరిచిత పురుషుడు విషయం తెలుసుకుని డాక్టరింటిదాకా సాయంగా వెళ్ళాడు. అర్ధరాత్రి బయట తిరిగిన ప్రతి ఆడదానికీ ఆపదలు ఎదురుకావు. ‘ఆ కాలం మంచిది, ఈ కాలంలోలా సినిమాలు, ఇంటర్నెట్‌లో బూతు సైట్లు లేవు’ అనడానికి లేదు. ఆ కాలం మంచిదైతే గాంధీజీకి- ‘స్ర్తికి రక్షణ వుంటేనే దేశానికి స్వాతంత్య్రం’ అనే మాట అవసరం ఉండేది కాదు కదా.
ఇంకో ఉదాహరణ. మద్రాసు (చెన్నై) నుంచి ఒక మహిళ భద్రాచలంలో వున్న పుట్టింటికి వెళ్లాలి. భద్రాచలంకి కాదు కదా హైదరాబాద్‌కు కూడా డైరెక్టు ట్రెయిన్స్ లేవు. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి డోర్నకల్‌లో దిగి తెల్లవారేదాకా చీకట్లోనే వెయిట్ చెయ్యాలి. ఉదయమొక్కటే పాసింజరు బండి భద్రాచలం రోడ్డుకి ఉండేది. అర్ధరాత్రి చిమ్మచీకట్లో ఆమెకు ఏ ఆపదా కలగలేదు. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఈ కాలంలోవి కూడా చెప్పుకోవచ్చు.
అర్ధరాత్రి అత్యవసర పరిస్థితులలో ఇల్లు కదిలిన ఆడవాళ్ళకి రక్షణ లభించే అవకాశం చాలా ఎక్కువ. మగవాళ్ళందరూ రేపిస్టులు కారు. మానవులందరూ స్వతహాగా దొంగలు కారు. ఎదురుగుండా పర్సు కన్పించినా ముట్టుకోని వాళ్ళుంటారు. పర్సు కన్పించినప్పుడు మనసు చలించే వారుంటారు. ఈ విషయానే్న మహిళలు గుర్తుంచుకోవడం- తమని తాము రక్షించుకోడానికి మొదటి మొట్టు. నగలు ధరించినపుడు కొంగు కప్పకుంటే గొలుసుని లాగెయ్యడం కష్టం. ఈ సూత్రమే అంతటా వర్తిస్తుంది.
‘బురఖా’ అనే పదాన్ని ‘హిజాబ్’ అని కూడా అంటారు. హిజాబ్ అనేది ‘స్ర్తి స్వాతంత్య్రానికి అడ్డు’ అని నమ్మేవాళ్ళు మలేషియా దేశాన్ని సందర్శించడం మంచిది. అక్కడ హిజాబ్ ధరించి టాక్సీ నడిపే స్ర్తిలున్నారు. గ్రీకులతో సంబంధ బాంధవ్యాలు లేని కాలంలో భారతదేశంలో స్ర్తిలకు ‘మేలిముసుగు’ వేసుకునే అలవాటు లేదని అంటారు. నిజమే కావచ్చు. పరస్ర్తిని తల్లిగా భావించే సంప్రదాయం భరతభూమిలో ఉన్నట్లుగా ప్రపంచమంతటా ఉండాలని లేదు. పర దేశాలతో సంపర్కం తప్పనపుడు స్ర్తి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా మేలిముసుగు మొదలైందేమో! అరబిక్ భాషలో మేలిముసుగుని ‘అబయ’ అంటారు. అభయాన్ని ఇచ్చేది కాబట్టి ‘అబయ’ అన్న పేరు వచ్చిందా? ఆలోచించాలి?

-పాలంకి సత్య