తెలంగాణ

మోదీ సర్కార్ పేదోళ్లది కాదు.. పెద్దోళ్లది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 22: ఎన్నికలకు ముందు దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించి, అధికారం చేపట్టిన అనంతరం వాటిని గాలికొదిలి పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు ఆరోపించారు. సిపిఎం అనుబంధ రైతు విభాగం వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి సూత్రాలు చెప్పి అధికారం చేపట్టిన బిజెపి పాలనలో మాత్రం అవినీతి సూత్రాలు అవలంబిస్తోందని, ప్రభుత్వ తీరుతో దేశం సంక్షోభ దశకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు,బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం రూపొందించిన చట్టాలు కూడా మార్చి, దేశాన్ని బడా పారిశ్రామికులకు అప్పగించే యత్నం చేస్తోందన్నారు. దేశంలోని వందకోట్ల మందిని వదిలిపెట్టి గుప్పెడు మందికి ప్రయోజనం చేకూర్చే బిజెపి ప్రభుత్వ విధానాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజా పోరాటాలను విడదీసే యత్నం చేస్తుందని విమర్శించారు. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చేందుకు తల్లివేరు అయిన ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి కుట్రలు పన్నుతోందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో వామపక్షాలే ప్రత్యామ్నాయం కానున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలన కూడా ఇందుకు తీసిపోలేదని, పేరుకే పేదల ప్రభుత్వమని, భూస్వాములకే పెద్దపీట వేస్తూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని విస్మరిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమకారిణి మల్లు స్వరాజ్యం మాణిక్‌సర్కార్‌కు వొడిసెలను బహుకరించారు. అంతకుముందు ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.