రాష్ట్రీయం

మళ్లీ గందరగోళమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: కొత్త ఇసుక విధానం సృష్టించిన గందరగోళం కారణంగా నిర్మాణ రంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించటంతో రాష్ట్రంలో ఇక ఇసుక కష్టాలు తీరతాయనుకున్న నిర్మాణ రంగం ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇ వేలం నిర్వహించినా ఇంత వరకు కొత్త విధానంలో ఒక్క రీచ్ కూడా తెరుకోకపోవటంతో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. వేలం నిర్వహణలో జాప్యం వల్ల మళ్లీ మహిళా పొదుపు సంఘాల ద్వారానే ఇసుక తవ్వకాలు, అమ్మకాలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ, గతం కన్నా పరిస్థితి మరింత దిగజారింది. ఎలాగూ మహిళా పొదుపు సంఘాలు చేజారిపోతోందన్న విషయం స్పష్టంకావటంతో చాలా చోట్ల మహిళా పొదుపు సంఘాలను అడ్డంపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ఇసుక విధానం సృష్టించిన గందరగోళం పుణ్యమా అని అక్రమ తవ్వకాలతో బయటకొచ్చిన ఇసుక ధర యూనిట్ రూ.5000 దాటిపోతోంది.
ఇంత దారుణమైన పరిస్థితిని తామెప్పుడూ చూడలేదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇసుక విధానంలో నిర్ణయించిన ఇసుక ధర, ఇ వేలం నిర్వహణ విధానం తదితర అంశాల పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారని, ఇలా అయితే రాష్ట్రప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గురువారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చెప్పిన సంగతి విదితమే. రాష్ట్రప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించినప్పటి నుండే ఈ విధానంలోని లోపాలు, కొత్త విధానాన్ని అమలుచేస్తే ఇసుక మాఫియా ఎలా విజృంభిస్తుందో ‘ఆంధ్రభూమి’ హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఇసుక విధానంలో మార్పులుచేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అందువల్లే ఇప్పటికే వేలం పూర్తయిన ఇసుక రీచ్‌లను కూడా కొత్త విధానంలో తెరవటం లేదని తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం జనవరి 15న ప్రకటించిన కొత్త విధానంలో మార్పులు చేయటం, సాధ్యమైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇసుకను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఏపి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఇసుక తవ్వకం, అమ్మకం బాధ్యతలను అప్పగించాలన్న ప్రతిపాదనతో పాటు, మరింత తక్కువ ధరకు ప్రజలకు ఇసుకను అందించేందుకు ముందుకొచ్చే లీజుదారులకు లాటరీ విధానంలో రీచ్‌లను అప్పగించటం తదితర ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.