బిజినెస్

మదుపరులలో జిడిపి జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 26: వరుసగా మూడు రోజులపాటు నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు 7-7.75 శాతం ఉండొచ్చని శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2015-16 అంచనా వేయడం మదుపరులను ఉత్సాహపరిచింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మళ్లీ 23 వేల ఎగువకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7 వేల స్థాయిని తిరిగి అందుకుంది. సెనె్సక్స్ 178.30 పాయింట్లు పుంజుకుని 23,154.30 వద్ద ముగియగా, నిఫ్టీ 59.15 పాయింట్లు కోలుకుని 7,029.75 వద్ద నిలిచింది. మెటల్, బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, పిఎస్‌యు రంగాల షేర్ల విలువ 1.66 శాతం నుంచి 1.06 శాతం మేర పెరిగాయి.
మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో నిలిచాయ. ఐరోపా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లోనే కదలాడాయి. కాగా, ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 554.85 పాయంట్లు, నిఫ్టీ 181 పాయంట్లు నష్టపోయాయ.