రంగారెడ్డి

కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 11: రాష్ట్రంలో నిరుపేదల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ మండల టిఆర్‌ఎస్‌కెవి (ఆటోయూనియన్) అధ్యక్షుడు ఎర్ర విజయ్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి ఆటోవాలాలు క్షీరాభిషేకం చేశారు. శనివారం పట్టణ ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌రావు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆటోవాలాలపై అమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తూ టాక్స్‌లను రద్దుచేశారని అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రూ. 5 లక్షలు ప్రమాదబీమా పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద రూ. 51 వేలు ప్రభుత్వం అందజేస్తున్నారని ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ తాను పేదల పక్షపాతినని కెసిఆర్ నిరూపించుకున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కాని నేతలు గాని పేదల అభ్యున్నతి కోసం ఇంతగా పాటుపడ్డ దాఖలాలు లేవని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ సుపరిపాలన సాగిస్తూ అన్నివర్గాల ప్రజల ఆదరభిమానాలను చూరగొందని వివరించారు. కెసిఆర్ పాలనా దక్షతకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఏ ఎన్నికలైనా టిఆర్‌ఎస్ ఘనవిజయాలు సాధించడమే ఇందుకు నిదర్శమన్నారు. గతంలో ఏ సిఎం చూరగొనని విధంగా సిఎం కెసిఆర్ ప్రజల విశ్వసనీయతను అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగులూరి సుధాకర్, ఉస్మాన్, నర్సింగ్, షఫీఖ్, రాజు, దెశ్‌మంత్‌రావు, బాబురావు, ఖలీల్, ఇస్మాయిల్, నరేశ్, జహంగీర్, సలీం, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.