క్రీడాభూమి

మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలుస్తాం : కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 22: ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్ డేమ్యాచ్‌లలో ఘోరంగా పరాజయం పాలయిన టీమిండియా శనివారం ఇక్కడ జరిగే చివరివన్‌డేలోనైనా విజయం సాధించి వైట్‌వాష్ అవమానాన్ని తప్పించుకోవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్‌డేలలో మొదటి మూడు మ్యాచ్‌లలో 300కుపైగా పరుగులు చేసినప్పటికీ ధోనీ సేన పరాజయాలను తప్పించుకోలేక పోయింది. కాన్‌బెర్రాలో జరిగిన నాలుగో వన్‌డేలో ఒక దశలో విజయం సాధించే స్థితిలో ఉన్న జట్టు చేజేతులా పరాజయాన్ని కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 26నుంచి ప్రారంభం కానున్న మూడు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కనీసం ఓ విజయంతోనైనా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. కాగా, శుక్రవారం తమ పరాజయాలకు కారణాలేమిటో అనే్వషించే పనిలో ధోనీ సేన ఉండగా కంగారూలు మాత్రం ఎలాంటి ఒత్తిడీ లేకపోవడంతో హాయిగా డ్రెస్సింగ్ రూమ్‌లో వివ్రాంతి తీసుకుంటూ గడిపారు. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండడంతో భారత ఆటగాళ్లు ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. శనివారం కూడా జల్లులు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో రేపు మ్యాచ్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, వరస పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ భారత జట్టు మానసికంగా కుంగిపోలేదని శనివారం జరిగే చివరి వన్‌డేతో పాటుగా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలిచి ఆస్ట్రేలియా పర్యటనను పాజిటివ్‌గా ముగిస్తామన్న ధీమాను టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తం చేశాడు. ప్రస్తుత వన్‌డే సిరీస్‌లో 4-0 తేడాతో వెనుకబడినప్పటికీ జట్టు నైతిక స్థైర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని చెప్పాడు.

‘మేము మానసికంగా కుంగిపోయి ఉంటే అసలు పోరాటమే చేయలేము. ప్రత్యర్థి ఉంచిన విజయ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో మరికొంత మెళకువగా ఉండి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవి. ప్రశ్నలు, చర్చలు కూడా వేరుగా ఉండేవి. అయితే ఈ ఫలితాలను గౌరవించి తీరాలి. అంతేకాదు ఆస్ట్రేలియా గట్టి ప్రత్యర్థి కావడమే కాక వారికి ఈ పరిస్థితుల గురించి మాకన్నా బాగా తెలుసు’ అని కోహ్లీ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. తాము ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని కోహ్లీ అంటూ, ఈ నాలుగూ గెలిచి సత్తా నిరూపించాలని అనుకుంటున్నామని అన్నాడు. రెండు వారాల క్రితం తాము ఇక్కడికి వచ్చినప్పుడు జట్టు నైతిక స్థైర్యం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అతను చెప్పాడు. కీలక సమయాల్లో జట్టు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేపోయిందని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు. కాగా, ఫాస్ట్‌బౌలర్లను ఎలాంటి బెరుకూ లేకుండా చితక బాదే వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్‌తో తనను పోల్చడం ఎంతమాత్రం భావ్యం కాదని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు.