మీకు మీరే మాకు మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి రచయితగా పనిచేసిన హుసేన్ షా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. తరుణ్‌శెట్టి, అవంతిక మిశ్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్లానెట్ గ్రీన్ స్టూడియో నిర్మిస్తోంది. మిగతా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా దర్శకుడు హుసేన్ షా కిరణ్ మాట్లాడుతూ, తెలుగు సినిమా ఆల్‌టైమ్ క్లాసిక్ నిలిచిన ‘మిస్సమ్మ’ చిత్రమంటే బాగా ఇష్టమని, ఆ సినిమాలోని ఓ సీన్‌నుంచి స్ఫూర్తిపొంది ఈ కథ తయారుచేశానని, ఆ సినిమా గౌరవంగా వుంటుందని, అందులోని బిట్ సాంగ్‌ని టైటిల్‌గా పెట్టామని చెప్పారు. చక్కటి ప్రేమకథతో మంచి ఫీల్ వున్న ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందని అన్నారు. ప్రతీ సీన్ మనకు జరిగినట్టుగానే అనిపిస్తుందని, త్వరలోనే ఈ చిత్రంలోని పాటలను విడుదలచేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సూర్య వినయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:కార్తీక్ వంశీ, నిర్మాత:ప్లానెట్ గ్రీన్స్ స్టూడియో, దర్శకత్వం:హుసేన్ షా కిరణ్.