మరో రీమేక్ కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రూస్‌లీ’ తరువాత రామ్‌చరణ్ హీరోగా నటించే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలా వుండగా ఇప్పుడు రామ్‌చరణ్ మరో రీమేక్‌పై కనే్నశాడు. జాన్‌అబ్రహం, శ్రుతిహాసన్ జంటగా బాలీవుడ్‌లో రూపొందిన ‘రాకీ హాండ్‌సమ్’ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమాను చేయాలనే ఉత్సాహంతో వున్నాడట రామ్‌చరణ్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంక్వైరీలు మొదలుపెట్టాడని, ఈ కథ గురించి ఇటీవలే శ్రుతిహాసన్ చరణ్‌కు చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెంచుకున్నాడు.