జాతీయ వార్తలు

ముందే చేసుంటే ఊహాగానాలు ఉండేవికావు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద రహస్య పత్రాలను బహిరంగ పర్చడం పట్ల ఆయన సన్నిహిత బంధువు కృష్ణబోస్ శనివారం హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పత్రాలను గనుక ఇంతకుముందే బహిరంగపరిచి ఉంటే నేతాజీ మృతికి సంబంధించి వివాదమే తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ‘మాకు సంతోషంగా ఉంది. ఈ పత్రాలను ఇంతకుముందే బహిరంగపరిచి ఉంటే ఎలాంటి ఊహాగానాలు ఉండేవి కావు. అయితే పత్రాలను విడుదల చేసి ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత మంచి పని చేశారు’ అని నేతాజీ సమీప బంధువు దివంగత శిశిర్ కుమార్ బోస్ భార్య అయిన కృష్ణ బోస్ అన్నారు. బహిరంగ పరిచిన ఫైళ్లను తాను ఇంకా చూడలేదని ఆమె చెప్తూ, 1945 ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన నివేదికను సమర్థించారు. ‘విమానం కూలిపోవడానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనాలున్నాయి. మనం ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం. విమాన ప్రమాదం జరగలేదని చెప్పడానికి మాకు ఎలాంటి సాక్ష్యాధారమూ లభించలేదు. అలాంటి సాక్ష్యమేదైనా లభిస్తే అప్పుడు ఆలోచిస్తాం’ అని ఆమె చెప్పారు. జపాన్ ప్రభుత్వం నేతాజీ మృతి గురించి మొత్తం ప్రపంచానికి తెలియజేసింది. జపాన్ ప్రధాని మన ప్రధానికి మంచిమిత్రుడు. దీనికి సంబంధించి జపాన్ ప్రధానితో మాట్లాడాలని మేము నరేంద్ర మోదీని కోరుతున్నాం’ అని కృష్ణబోస్ చెప్పారు. ఈ రోజు బహిరంగ పరచిన ఫైళ్లలోని అంశాలపై వ్యాఖ్యానించడానికి ఆమె నిరాకరించారు. నేను ఆ ఫైళ్లను ఇంకా చూడలేదు. చూడకుండానే ఎలా వాటిపై వ్యాఖ్యానిస్తాను. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగవద్దు’ అని ఆమె అన్నారు.
లీడర్ ఆఫ్ ద నేషన్‌గా ప్రకటించాలి
డార్జిలింగ్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ‘లీడర్ ఆఫ్ ద నేషన్’గా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల క్రితం కనుమరుగైపోయిన మన జాతీయ నేత ఆచూకీ తెలుసుకోవాలని దేశంలోని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆమె అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా శనివారం డార్జిలింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమత మాట్లాడారు. నేతాజీ మరణానికి సంబంధించిన ఫైళ్లను, డాక్యుమెంట్లను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం వద్దనున్న 64 రహస్య డాక్యుమెంట్లను మమతా బెనర్జీ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఇలావుండగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీకి సంబంధించిన 100 ఫైళ్లను బహిర్గతం చేశారు.