క్రీడాభూమి

ముర్రే ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే నాలుగో రౌండ్ చేరాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను జవో సౌసాను 6-2, 3-6, 6-2, 6-2 తేడాతో ఓడించి ముందంజ వేశాడు. రెండో సెట్‌లో తడబడినప్పటికీ, ముర్రే ఈ మ్యాచ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా 6-2, 6-3, 7-6 తేడాతో లుకాస్ రొసొల్‌పై గెలుపొందగా, 13వ సీడ్ మిలోస్ రవోనిక్ 6-2, 6-3, 6-4 తేడాతో విక్టర్ ట్రోయికీపై విజయాన్ని నమోదు చేశాడు. బలమైన సర్వీసులతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే జాన్ ఇస్నర్ 6-7, 7-6, 6-2, 6-4 స్కోరుతో ఫాలిసియానో లొపెజ్‌పై గెలిచాడు. గేల్ మోన్ఫిల్ 7-5, 6-3, 6-2 తేడాతో స్టెఫెన్ రాబర్ట్‌ను ఓడించాడు.