రాష్ట్రీయం

మన్యంలో మళ్లీ పెరిగిన చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 24: విశాఖ మన్యంలో గత నాలుగు రోజులుగా చలితీవ్రత మళ్ళీ అధికమైంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో మన్యంతో పాటు మైదానంలో సైతం చలి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల నుండే చలిగాలులు వీస్తుండడంతో పాటు వర్షంలా మంచుకురుస్తోంది. ఆదివారం ఉదయం లంబసింగిలో నాలుగు డిగ్రీలు, చింతపల్లిలో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలో చలితీవ్రత తగ్గుముఖం పట్టినా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని గత నాలుగు రోజుల నుండి విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. మన్యంలో మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు వర్షంలా కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలితీవ్రత పెరగడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంబసింగికి తరలివచ్చే పర్యాటకులు చలితో పాటు వర్షంలా కురుస్తున్న మంచును ఆస్వాదిస్తున్నారు. దీంతో లంబసింగికి పర్యాటకుల తాకిడి మళ్ళీ పెరిగింది. మరో 4 రోజులు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.