సబ్ ఫీచర్

మేధరులకు ఆదరణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనుకబడిన తరగతుల కులాల్లో తరతరాలుగా వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న కులాలకు చెందినవారు కుల పరంగా, సామాజిక, ఆర్థిక, అసమానతలతో అభివృద్ధికి దూరమై రోడ్డున పడుతున్నారు. ప్రపంచీకరణవలన కుల వృత్తుల్లోకి పెట్టుబడి ప్రవేశించింది. తెలంగాణ రాష్ట్రంలో తరతరాల నుంచి ‘మేదరి కులస్తులు’ అడవుల్లో దొరికే వెదురుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అడవుల్లోకి వెళ్ళి వెదురును సేకరించడం, ఆ వెదురుతో ప్రజలకు అవసరమయ్యే గృహ ఉపకరణాలు చేటలు, బుట్టలు, కుర్చీలు, మంచాలు, మంచాలకు అల్లే నులక తాడు, చీపుర్లు, చాపలు, పంటలు నిర్వచేసుకునే బోరెలు, శుభ,అశుభ కార్యాలకు పందిళ్లు, శవాలను మోసే పాడెలు, వ్యవసాయానికి ఉపయోగపడే సామగ్రి తయారుచేస్తారు. వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రచారానికుపయోగించే ఫ్లెక్సీలు వాడవాడల్లో, మెయిన్ రోడ్లప్రక్కన వీరే వెదురు బొంగులతో ఏర్పాటుచేస్తుంటారు. ఈ పనుల్లో పురుషులతోపాటు మహిళలు సమాన స్థాయిలో పాలుపంచుకుంటారు. వృద్ధులు, పిల్లలు సైతం పెద్దలకు వృత్తిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటారు.
అయితే 1990లో ఎప్పుడైతే ప్రపంచీకరణ, పారిశ్రామీకరణ మొదలయ్యిందో ఇక అప్పట్నుంచి కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్న ప్లాస్టిక్ వస్తువుల తాకిడితో మేదరులు తయారుచేసే తట్టలు, బుట్టలు, చీపుర్లు తదితర వస్తువులకు డిమాండ్ పడిపోయంది. ఇంకోవైపు ఉమ్మడి రాష్ట్రంలో వెదురును ప్రభుత్వం వేలం వేయడంతో ఈ వృత్తిలోకి దళారులు ప్రవేశించి కులస్తులకు వెదురుదొరకనీయకుండా చేస్తుండడంతో పేద వృత్తిదారులకు కడుపుకింత కూడు దొరకడం కష్టమైతున్నది. అప్పోసప్పో చేసి వెదురు కొనుక్కున్నా వాటితో వస్తువులను తయారుచేసి అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలు ప్రభుత్వం కల్పిచకపోవడంతో చాలా నష్టాల్లో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో వెదురు పారిశ్రామిక సంఘాలు ఉన్నప్పటికీ ఇవి అసలు వృత్తిదారులకన్నా, పెట్టుబడి దళారీ వర్గాలకే అధికంగా ఉపయోగపడుతున్నాయి. నిజమైన వృత్తిదారులు కొన్నిచోట్ల కుల సంఘాల సహకారంతో సహకార సంఘాలను కష్టపడి నడుపుకుంటున్నా అమ్మకపు పన్ను, ఆదాయ పన్నుల రూపంలో వీరి ఆదాయాన్ని అధిక శాతం ప్రభుత్వమే గుంజుకుంటున్న పరిస్థితిలో తీవ్రంగా నష్టపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో దాదాపు లక్ష మేదర కుటుంబాలు ఉన్నాయి. అడవికి, గ్రామాలకు మధ్య తిరుగుతూ కుల వృత్తిని నమ్ముకొని సంచార జీవనం చేస్తున్నవీరికి రిజర్వేషన్ పరంగా వెనుకబడిన తరగతి గ్రూపు ఏలో క్రమసంఖ్య 11లో ఉమ్మడి రాష్ట్రంలో క్రమ సంఖ్య 14లో తెలంగాణ రాష్ట్రం వచ్చినంక చేర్చడంతో అన్యాయమే జరిగింది. వీరిని షెడ్యూల్డు తెగల్లో చేర్చితే విద్యా, ఆర్థిక, సామాజిక రంగాల్లో న్యాయం జరుగుతుంది. రాజకీయంగా ప్రభావితం చేయలేకపోయినా ఉద్యమంలో 16 మంది మేదరులు అమరులయ్యారు. అనాదిగా అడవిపై ఆధారపడిన వీరికి ఇతర బీసీ కులస్తులకు చేపట్టిన ఆర్థిక ఫెడరేషన్లు లేవు. తెలంగాణలో ప్రతి గ్రామంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న వీరిలో పలువురు కుల వృత్తిపై ఆధారపడి జీవించలేని పరిస్థితుల్లో దుబాయ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, గల్ఫ్ దేశాలకు, ముంబాయి, హైదరాబాద్ వెళ్ళి కూలిపనులు చేసుకుంటూ కుటుంబాలకు సహాయపడుతున్నారు. కొద్దిమంది మాత్రమే చిరుద్యోగాల్లో, చిరు వ్యాపారుల్లో ఉన్నా మెజారిటీ కులస్తులు వృత్తిని నమ్ముకొని విద్యలేక, భూమి లేక, స్థిర నివాసాలు లేక తెగిన గాలిపటాలుగా బతుకుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేదరుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికై వీరికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించాలి. అప్పుడే వారు ప్రజలకోసం, కుటుంబాలకోసం ఆత్మగౌరవంతో హుందాగా బతుకుతారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములవుతారు.

- హరి అశోక్‌కుమార్