జాతీయ వార్తలు

మెట్రో రైల్లో ప్రయాణించిన హోలాన్, నరేంద్ర మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ మెట్రోరైల్‌లో కలిసి ప్రయాణం చేశారు. గుర్‌గావ్‌లో ఇంటెరం సెక్రెటేరియట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ (ఐఎస్‌ఏ) ప్రారంభోత్సవానికి ఇరుదేశాధినేతలు వెళ్లారు. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు హోలాన్, మోదీలు మెట్రో ప్రయాణం చేసినట్టు అధికార వర్గాలు తెలిపారు. ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం, భారత అధికారులు వారి వెంట ఉన్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ కూడా మెట్రోలో వెళ్లారు. ఈ విషయాన్ని పిఎంఓ ట్విట్టర్‌లో వెల్లడించింది. నేతలిద్దరూ మెట్రో రైల్‌లో ప్రయాణిస్తున్న ఫొటోలు ట్విట్టర్‌లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ, ఫ్రాంకోయిస్ హోలాన్‌లు రేస్‌కోర్టు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వేచిఉన్న ఫొటోను పిఎంఓ వైబ్‌సైట్‌లో ఉంచారు. ఇరువురు నేతలు గుర్‌గావ్‌కు మెట్రోలో ప్రయాణించిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్యఅతిథి హోలాన్ ఆదివారమే భారత్‌కు చేరుకున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఆధ్వరంలో జరిగే కార్యక్రమంలో హోలాన్ పాల్గొన్నట్టు తెలిపారు.